ఎర్రకోటపై ప్రధాని మోదీ 11వ సారి జాతీయ పతాకావిష్కరణ

ABN, Publish Date - Aug 15 , 2024 | 01:46 PM

న్యూఢిల్లీ: 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11వ సారి దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురువేశారు. అంతకు ముందు ఆయన రాజ్‌ఘాట్‌లో నివాళులర్పించి ఎర్రకోటకు చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆయన త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఈ కార్య్రమానికి కేంద్ర మంతులు, ఎంపీలు, సైనికాధికారులు, పలువురు సెలబ్రిటీలు తదితరులు హాజరయ్యారు.

 ఎర్రకోటపై ప్రధాని మోదీ 11వ సారి జాతీయ పతాకావిష్కరణ 1/7

78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..

 ఎర్రకోటపై ప్రధాని మోదీ 11వ సారి జాతీయ పతాకావిష్కరణ 2/7

ఎర్రకోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సెల్యూట్ చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ..

 ఎర్రకోటపై ప్రధాని మోదీ 11వ సారి జాతీయ పతాకావిష్కరణ 3/7

ఎర్రకోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ..

 ఎర్రకోటపై ప్రధాని మోదీ 11వ సారి జాతీయ పతాకావిష్కరణ 4/7

ఎర్రకోటలో జరిగిన 78వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలకు విచ్చేన ప్రజలకు అభివాదం తెలుపుతున్న ప్రధాని మోదీ..

 ఎర్రకోటపై ప్రధాని మోదీ 11వ సారి జాతీయ పతాకావిష్కరణ 5/7

ఎర్రకోటలో త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..

 ఎర్రకోటపై ప్రధాని మోదీ 11వ సారి జాతీయ పతాకావిష్కరణ 6/7

రాజ్‌ఘాట్‌లో నివాళులర్పిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ..

 ఎర్రకోటపై ప్రధాని మోదీ 11వ సారి జాతీయ పతాకావిష్కరణ 7/7

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రజలతో మమేకమైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ

Updated at - Aug 15 , 2024 | 01:46 PM