Home » celebrations
75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని సాధారణ పరిపాలనా శాఖ ప్రభుత్వ కార్యదర్శి (రాజకీయ) ఎస్.సురేశ్ కుమార్ అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఈ వేడుకల్లో భాగంగా భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పిస్తారు.
నవంబర్ 14 నుంచి (బుధవారం) డిసెంబర్ 9 వరకు ప్రజా పాలన విజయోత్సవాలు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఎల్‌బి స్టేడియంలో ప్రజా పాలన విజయోత్సవాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 26 రోజులపాటు ప్రజా పాలన విజయోత్సవాలు జరుగుతాయి.
తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఘనంగా విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. అందుకోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో సబ్ కమిటీని ప్రభుత్వం నియమించింది. సచివాలయంలో ఈ కమిటీ సమావేశమై విజయోత్సవ ఉత్సవాలపై చర్చించింది.
మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో విజయదశమి వేడుకలను శని వారం అంగరంగ వైభవంగా వైభవంగా నిర్వహించారు.
శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం నాటికి ఉత్సవాలు తొమ్మిదవరోజుకు చేరుకున్నాయి. మహోత్సవాల్లో భాగంగా ఈరోజు సిద్ధిదాయిని అలంకారంలో శ్రీ భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిస్తున్నారు.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ‘మహాకనకదుర్గ..విజయకనకదుర్గ’గా అమ్మవారు భక్తుల కు దర్శనమిచ్చారు.
దసరా శరన్నవరాత్రి ఉత్స వాల్లో భాగంగా మూడో రోజైన ఆదివారం మదనపల్లె పట్ట ణంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి లలితాదేవి అలంకరణ లో భక్తులను కటాక్షించారు.
విజయవాడ కనకదుర్గగుడిలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది. ఎటువంటి అర్హత లేకపోయినా వైసీపీ నాయకులకు ఫోటో కాల్ దర్శనం కల్పించారు. సాక్షాత్తు ఈవో అమ్మవారి ఫోటో ఇచ్చి మరీ వేద ఆశీర్వాదం చేయించడం సర్వత్ర చర్చనీయాంశమైంది. దుర్గ గుడి ఉన్నతాధి అధికారులు వైసీపీ నాయకుడు పోతిన మహేష్‌కు దగ్గరుండి ప్రోటోకాల్ దర్శనం చేయించారు.
చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపంలో కూడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా శ్రీ లలితా త్రిపుసుందరి దేవి భక్తులను అనుగ్రహిస్తుంది. కాగా రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతోంది. శనివారం సాయంత్రం నుంచి ఉత్తరాంధ్ర నుంచి వచ్చే భక్తుల రాక ప్రారంభమైంది.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడోరోజైన శనివారం అన్నపూర్ణాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శన మిచ్చి కనువిందు చేశారు.