HICC: సీఎం రేవంత్‌ రెడ్డితో బిగ్ షాట్‌ల భేటీ

ABN, Publish Date - Sep 05 , 2024 | 01:11 PM

హైదరాబాద్: నగరంలోని హెచ్ఐసీపీ (HICC)లో గురువారం తొలిసారిగా ఏఐ (AI) గ్లోబల్ సమ్మిట్ 2024 ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, వివిధ దేశాలకు చెందిన సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. రాబోయే రెండు, మూడేళ్లలో రాష్ట్రంలో ఏఐ అభివృద్ధికి చేపట్టే చర్యలను ఇందులో పేర్కొన్నారు. ఇవాళ, రేపు రెండు రోజులపాటు ఈ సమ్మిట్ జరుగుతుంది. ప్రపంచంతోపాటు వేగంగా ప్రయాణించాలన్న లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)కి అత్యంత ప్రాధాన్యమిస్తోంది.

HICC: సీఎం రేవంత్‌ రెడ్డితో బిగ్ షాట్‌ల భేటీ 1/6

హైదరాబాద్‌లోని హెచ్ఐసీపీ (HICC)లో గురువారం తొలిసారిగా ఏఐ (AI) గ్లోబల్ సమ్మిట్ 2024 ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి..

HICC: సీఎం రేవంత్‌ రెడ్డితో బిగ్ షాట్‌ల భేటీ 2/6

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏఐ ప్రతినిధులు

HICC: సీఎం రేవంత్‌ రెడ్డితో బిగ్ షాట్‌ల భేటీ 3/6

ఐబీఎం ప్రతినిధితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు..

HICC: సీఎం రేవంత్‌ రెడ్డితో బిగ్ షాట్‌ల భేటీ 4/6

రాబోయే రెండు, మూడేళ్లలో రాష్ట్రంలో ఏఐ అభివృద్ధికి చేపట్టే చర్యలపై ఆ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు..

HICC: సీఎం రేవంత్‌ రెడ్డితో బిగ్ షాట్‌ల భేటీ 5/6

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో యొట్ట ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్ ఎల్ఎల్‌పి (Yotta infrastructure solution LLP) సీఈవో సునీల్ గుప్తా భేటీ.. హైదరాబాద్‌లో జీపీయూ ఆధారిత ఏఐ క్లౌడ్ ఏర్పాటులో భాగస్వామ్యంపై చర్చ.

HICC: సీఎం రేవంత్‌ రెడ్డితో బిగ్ షాట్‌ల భేటీ 6/6

హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ (HICC)లో జరుగుతున్న ఏఐ (AI) గ్లోబల్ సమ్మిట్‌లో ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు..

Updated at - Sep 05 , 2024 | 01:11 PM