Rain Alert: వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

ABN, Publish Date - Sep 03 , 2024 | 10:52 AM

ఖమ్మం: తెలంగాణలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలు కుండపోతగా పడటంతో ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగు పొంగి ఉధృతంగా ప్రవహించింది. దీంతో పలు కాలనీలు జలమయం అయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటించి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. వరద సహాయక చర్యలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

Rain Alert: వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన 1/7

ఖమ్మం జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రక్కన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి..

Rain Alert: వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన 2/7

ఖమ్మం, పాలేరు నియోజకవర్గం రూరల్ మండలంలో వరద బాధితులను పరామర్శించి వారి సమస్యలను అడగి తెలుసుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

Rain Alert: వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన 3/7

వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడొద్దని బాధితులకు భరోసా కల్పిస్తున్న సీఎం..

Rain Alert: వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన 4/7

ఖమ్మం, పాలేరు నియోజకవర్గంలోని వరద బాధితుల నివాసానికి వెళ్లి పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ప్రక్కన మంత్రి పొంగులేటి..

Rain Alert: వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన 5/7

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తన సమస్యను చెప్పుకుని బాధపడుతున్న ఓ బాధితురాలు...

Rain Alert: వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన 6/7

రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి..

Rain Alert: వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన 7/7

మున్నేరు వరదకు సంబంధించి అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి తదితరులు..

Updated at - Sep 03 , 2024 | 10:52 AM