కాలిఫోర్నియాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన దృశ్యాలు..

ABN, Publish Date - Aug 09 , 2024 | 12:46 PM

కాలిఫోర్నియా: అమెరికా పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీ బిజీ గడుపుతున్నారు. పెట్టుబడులు, సమీకరణే లక్ష్యంగా పలు కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. శుక్రవారం కాలిఫోర్నియాలోని యాపిల్ హెడ్ క్వార్టర్స్‌ను సందర్శించారు. అలాగే పెట్టుబడులకు సంబంధించి పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకోనున్నారు. కాగా ఆర్థికపరమైన సేవల్లో పేరొందిన అమెరికా బహుళ జాతి సంస్థ చార్లెస్‌ స్క్వాబ్‌ కంపెనీ హైదరాబాద్‌లో టెక్నాలజీ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అమెరికా పర్యటనలో భాగంగా డాల్‌సలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌ బాబుతో కంపెనీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు డెన్నిస్‌ హోవార్డ్‌, రామ బొక్కా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కంపెనీ భారత్‌లో తన తొలి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని ప్రకటించింది.

Updated at - Aug 09 , 2024 | 12:46 PM