యాదాద్రి భువనగిరి జిల్లాలో గవర్నర్ పర్యటన..

ABN, Publish Date - Aug 30 , 2024 | 11:57 AM

యాదాద్రి భువనగిరి జిల్లా: మూడు రోజుల పర్యటన నిమిత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాకు వచ్చిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గురువారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆలేరులోని కొలను పాక, జైన్ మందిర్, కోటి లింగాలు, భువనగిరిలోని స్వర్ణగిరి దేవాలయాన్ని రాష్ట్ర గవర్నర్ దర్శించుకున్నారు. స్వామివార్లకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ రేట్ కార్యాలయంలో కవులు, రచయితలతో సమావేశం అయ్యారు. జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జెండగే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో గవర్నర్ పర్యటన.. 1/9

కొలనుపాకలో శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకొని, అభిషేక పూజలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

యాదాద్రి భువనగిరి జిల్లాలో గవర్నర్ పర్యటన.. 2/9

తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు ఆలయ అర్చకులు శఠగోపంతో ఆశీర్వచనాలు అందిస్తున్న దృశ్యం..

యాదాద్రి భువనగిరి జిల్లాలో గవర్నర్ పర్యటన.. 3/9

జలనారాయణుడి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ.

యాదాద్రి భువనగిరి జిల్లాలో గవర్నర్ పర్యటన.. 4/9

గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు అర్చకులు ఆశీర్వచనాలు అందించి.. చిత్రపటాన్ని బహూకరించారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో గవర్నర్ పర్యటన.. 5/9

జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రచయితలు, కళాకారులు, జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీతలతో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్ని ప్రసంగిస్తున్న దృశ్యం.

యాదాద్రి భువనగిరి జిల్లాలో గవర్నర్ పర్యటన.. 6/9

తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ పుస్తకాన్ని బహూకరించారు...

యాదాద్రి భువనగిరి జిల్లాలో గవర్నర్ పర్యటన.. 7/9

స్వాతంత్ర్య సమరయోధులతో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ...

యాదాద్రి భువనగిరి జిల్లాలో గవర్నర్ పర్యటన.. 8/9

వృద్ధుల ఉచిత వైద్య చికిత్స సంచార వాహనం మొబైల్ మెడికేర్ యూనిట్‌ను ప్రారంభించిన గవర్నర్.. ఈ సందర్భంగా ఆస్పత్రి సిబ్బంది జిష్ణు దేవ్ వర్మకు మెమెంటోను బహుకరిస్తున్న దృశ్యం.

యాదాద్రి భువనగిరి జిల్లాలో గవర్నర్ పర్యటన.. 9/9

జిల్లా కలెక్టరే‌ట్ కార్యాలయంలో రచయితలు, కళాకారులు, అవార్డు గ్రహీతలు, స్వాతంత్ర్య సమరయోధులతో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ...

Updated at - Aug 30 , 2024 | 11:57 AM