Home » Yadadri Bhuvanagiri
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం సర్వేల్ గురుకుల పాఠశాలలో వేడి రాగి జావ మీద పడి ఇద్దరు విద్యార్థులకు గాయాలైన ఘటనలో ఆ గురుకులం ప్రిన్సిపాల్ వెంకటేశంపై సస్పెన్షన్ వేటు పడింది. విద్యార్థులకు అల్పాహారం అందించే విషయంలో ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం, పర్యవేక్షణాలోపం ఉందని భావిస్తూ ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
నలభై శాతం పెరిగిన డైట్ చార్జీలతో రెండు రోజుల క్రితం అమలులోకి వచ్చిన నూతన డైట్‌ను యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అమలు చేయడం లేదు.
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న నాలుగు వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్‌స్టేషన్‌లో తొలి యూనిట్‌ను(800 మెగావాట్ల సామర్థ్యం) ఈ నెల 6వ తేదీన ప్రారంభించనున్నారు.
హాస్టళ్లు, పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఒక వైపు అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా కొందరి నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులకు నాణ్యతలేని భోజనమే అందుతోంది.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినరసింహ స్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారిని దర్శించుకోడానికి ప్రముఖులు, భక్త జనం పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. లక్ష్మీనరసింహ స్వామి ధర్మ దర్శనానికి సుమారు 2 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు ఆదివారం పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆషాఢమాసం అయినప్పటికీ సెలవు రోజు కావడంతో సుమారు 30 వేల మంది భక్తులు రాగా.. ప్రత్యేక, ధర్మ దర్శన క్యూలైన్లలో ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీ కొనసాగింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ (శుక్రవారం) యాదాద్రికి చేరుకున్నారు. యాదగిరి గుట్ట ప్రధాన దేవాలయానికి చేరుకున్న సీఎం... యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆపై ఆఖండ దీపారాదన చేశారు. సీఎం వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, విప్ బీర్ల ఐలయ్య ఉన్నారు.
శుక్రవారం మధ్యాహ్నాం 1:30లకు రోడ్డుమార్గాన వలిగొండ మండలం సంగెంకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. సంగెం నుంచి మూసీ నది పునరుజ్జీవ సంకల్ప పాదయాత్రను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.
తెలంగాణ తిరుపతిగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణంలో నాణ్యతా లోపాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఆలయం దక్షిణ భాగంలోని తిరువీధుల్లో ప్రాకార మండపం వెలుపల ఉన్న ఫ్లోరింగ్ కుంగిపోయింది.
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రం సమీపంలో కొత్త టౌన్‌షి్‌ప ఏర్పాటు కానుంది. తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) రూ.928.52 కోట్ల అంచనాతో ఈ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షి్‌పను నిర్మించనుంది.