భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

ABN, Publish Date - Oct 25 , 2024 | 10:13 AM

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలంలో శ్రీ సీతారామ చంద్ర స్వామివారిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. కాగా దేవస్థానం తరపున స్వామివారి ప్రసాదం, శాలువా, జ్ఞాపికను గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు దేవస్థానం ఈవో ఎల్ రమాదేవి అందజేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య కార్యదర్శి. వెంకటేశం, సంయుక్త కార్యదర్శి భవాని శంకర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు, కొత్తగూడెం ఐటీడీఏ పీవో బి రాహుల్, దేవస్థానం ఇంజనీరింగ్ విభాగం ఈఈ వి రవీంద్రనాథ్ , ఏఈఓ భవాని రామకృష్ణారావు, పర్యవేక్షకులు లింగాల వైదిక పరిపాలన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న  గవర్నర్  జిష్ణుదేవ్ వర్మ 1/8

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి వస్తున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ..

భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న  గవర్నర్  జిష్ణుదేవ్ వర్మ 2/8

శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ధ్వజస్థంబం వద్ద గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఈవో ఎల్ రమాదేవి, అధికారులు..

భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న  గవర్నర్  జిష్ణుదేవ్ వర్మ 3/8

భద్రాద్రి రామయ్యను దర్శించుకుంటున్న తెలంగాణ గవర్నర్..

భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న  గవర్నర్  జిష్ణుదేవ్ వర్మ 4/8

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు తలపాగ కడుతున్న భద్రాచలం అర్చకుడు..

భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న  గవర్నర్  జిష్ణుదేవ్ వర్మ 5/8

భద్రాద్రి రామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన గవర్నర్‌కు శఠగోపం పెట్టి ఆశీర్వదిస్తున్న వేద పండితుడు..

భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న  గవర్నర్  జిష్ణుదేవ్ వర్మ 6/8

తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను పట్టు వస్త్రాలతో సత్కరిస్తు్న్న ఆలయ అర్చకులు..

భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న  గవర్నర్  జిష్ణుదేవ్ వర్మ 7/8

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు స్వామి వారి మెమెంటోను అందజేస్తున్న ఆలయ ఈవో ఎల్ రమాదేవి.

భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న  గవర్నర్  జిష్ణుదేవ్ వర్మ 8/8

భద్రాచలం ఆలయం అర్చకులతో ముచ్చటిస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ..

Updated at - Oct 25 , 2024 | 10:13 AM