గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణస్వీకారం

ABN, Publish Date - Aug 01 , 2024 | 12:45 PM

హైదరాబాద్: తెలంగాణ నూతన గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ బాధ్యతలు చేపట్టారు. రాజ్‌భవన్‌లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన గవర్నర్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి, జస్టిస్‌ అలోక్‌ అరాధే పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా గవర్నర్‌ను వెంట తీసుకెళ్లి మంత్రులు, ఇతర ప్రముఖుల్ని పరిచయం చేశారు.

గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణస్వీకారం 1/8

తెలంగాణ నూతన గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ బాధ్యతలు చేపట్టారు. రాజ్‌భవన్‌లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.

గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణస్వీకారం 2/8

జిష్ణుదేవ్‌ వర్మ ప్రమాణ స్వీకారం అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే ఆయనకు పుష్పగుచ్చములిచ్చి శుభాకంక్షాలు తెలిపారు.

గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణస్వీకారం 3/8

కొత్త గవర్నర్‌కు పుష్పగుచ్చములిచ్చి శుభాకాంక్షలు చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి తుమ్మల..

గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణస్వీకారం 4/8

రాజ్‌భవన్‌లో గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డితో ముచ్చటిస్తున్న జిష్ణుదేవ్‌ వర్మ..

గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణస్వీకారం 5/8

శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పగుచ్చములిచ్చి స్వాగతం పలికారు.

గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణస్వీకారం 6/8

శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు స్వాగతం పలికిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి..

గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణస్వీకారం 7/8

రాష్ట్ర నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలికిన డీజీపీ జితేందర్..

గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణస్వీకారం 8/8

శంషాబాద్ విమానాశ్రయంలో సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్న నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.

Updated at - Aug 01 , 2024 | 12:45 PM