ఘనంగా సీతారాం ఏచూరీ సంస్మరణ సభ.. సేవలను స్మరించుకున్న నేతలు

ABN, Publish Date - Sep 21 , 2024 | 02:48 PM

కమ్యూనిస్టు యోధుడు సీతారాం ఏచూరీ సంస్మరణ సభ హైదరాబాద్ రవీంద్ర భారతిలో శనివారం జరిగింది. వివిధ పార్టీల నేతలు సంస్మరణ సభకు హాజరయ్యారు. సీతారాం ఏచూరి సేవలను స్మరించుకున్నారు.

ఘనంగా సీతారాం ఏచూరీ సంస్మరణ సభ.. సేవలను స్మరించుకున్న నేతలు 1/6

కమ్యూనిస్టు యోధుడు సీతారాం ఏచూరీ సంస్మరణ సభ హైదరాబాద్ రవీంద్ర భారతిలో శనివారం జరిగింది. వివిధ పార్టీల నేతలు సంస్మరణ సభకు హాజరయ్యారు. సీతారాం ఏచూరి సేవలను స్మరించుకున్నారు.

ఘనంగా సీతారాం ఏచూరీ సంస్మరణ సభ.. సేవలను స్మరించుకున్న నేతలు 2/6

సమావేశంలో పాల్గొన్న వారిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం, సీపీఎం సీనియర్ నేత తమ్మినేని వీరభద్రం, సీపీఎం బీవీ రాఘవులు తదితరులు ఉన్నారు.

ఘనంగా సీతారాం ఏచూరీ సంస్మరణ సభ.. సేవలను స్మరించుకున్న నేతలు 3/6

సభలో కేటీఆర్.. సీతారాం ఏచూరి గొప్పదనాన్ని కీర్తించారు. ఉద్యమం నుంచి వచ్చిన బిడ్డలుగా ఏచూరీతో తమ బంధం రక్త సంబంధం అని అన్నారు.

ఘనంగా సీతారాం ఏచూరీ సంస్మరణ సభ.. సేవలను స్మరించుకున్న నేతలు 4/6

నమ్మిన సిద్ధాంత కోసం ఆఖరి వరకు పోరాడిన ఏచూరీ జీవితం తమ లాంటి వారికి ఆదర్శం అని పేర్కొన్నారు. ఫిరాయింపు రాజకీయాలు ఉన్న ఈ కాలంలో పదవుల కోసం కాకుండా.. సిద్ధాంతం కోసం పని చేసిన గొప్ప నాయకుడు ఏచూరీ అని కీర్తించారు.

ఘనంగా సీతారాం ఏచూరీ సంస్మరణ సభ.. సేవలను స్మరించుకున్న నేతలు 5/6

తిట్లు, బూతులు చలామణి అవుతోన్న ప్రస్తుత రాజకీయాల్లో ఏచూరీ రాజకీయ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం అని కేటీఆర్ అన్నారు.

ఘనంగా సీతారాం ఏచూరీ సంస్మరణ సభ.. సేవలను స్మరించుకున్న నేతలు 6/6

కేటీఆర్ తన ప్రసంగం ముగిసిన వెంటనే సభ నుంచి తిరుగుపయనం అయ్యారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సభకు హాజరయ్యారు.

Updated at - Sep 21 , 2024 | 02:48 PM