Telangana: వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర మంత్రి

ABN, Publish Date - Sep 07 , 2024 | 03:25 PM

ఖమ్మం జిల్లా: తెలంగాణలో ఖమ్మం జిల్లా వరద ప్రభావిత ప్రాంతంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు. ఆయనతోపాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఉన్నారు. ఇటీవల తెలంగాణలో భారీ వర్షాలు కురవడంతో పలు జిల్లాల్లో పంట నష్టం వాటిళ్లింది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో నష్టం ఎక్కువగా వాటిల్లింది. మున్నేరు ఉధృతికి ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, మధిర, పాలేరు నియోజకవర్గాల్లో కేంద్ర మంత్రులు పర్యటించారు.

Telangana: వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర మంత్రి 1/7

ఖమ్మం జిల్లా వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తదితరులు..

Telangana: వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర మంత్రి 2/7

వరద ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలిస్తు్న్న కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్, ఇంకా రాష్ట్ర మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి..

Telangana: వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర మంత్రి 3/7

కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు వరద ప్రభావిత పరిస్థితులను వివరిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి..

Telangana: వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర మంత్రి 4/7

వరదలకు పంట నష్టపోయిన ఓ రైతు కేంద్ర మంత్రికి తన బాధలు చెప్పుకుని కన్నీటిపర్యంతమైన అతనిని ఓదారుస్తు్న్న శివరాజ్ సింగ్ చౌహాన్‌..

Telangana: వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర మంత్రి 5/7

వరద ముంపుకు గురైన ప్రాంతాల ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తున్న కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్..

Telangana: వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర మంత్రి 6/7

తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ అధికారులతో సమావేశం నిర్వహించిన శివరాజ్ సింగ్ చౌహాన్..

Telangana: వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర మంత్రి 7/7

రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించిన కేంద్ర మంత్రి.. శివరాజ్ సింగ్ చౌహాన్ చేతులు పట్టుకుని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్న దృశ్యం.

Updated at - Sep 07 , 2024 | 03:25 PM