జింక్ అధికంగా ఉన్న వెజిటేరియన్ ఆహారాల గురించి తెలుసా?

ABN, Publish Date - Oct 14 , 2024 | 03:58 PM

శరీరం ఆరోగ్యంగా ఉండటానికి చాలా రకాల పోషకాలు అవసరం అవుతాయి. వీటిలో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు, ఎంజైమ్ లు మొదలైనవి ఉంటాయి. శరీరానికి అవసరమైన ఖనిజాలలో జంగ్ ప్రధానమైనది.

జింక్ అధికంగా ఉన్న వెజిటేరియన్ ఆహారాల గురించి తెలుసా? 1/7

శరీర రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచడం నుండి గాయాలను నయం చేయడం వరకు..కణాల పెరుగుదలను ప్రోత్సహించడం నుండి చాలా రకాల విధులు నిర్వర్తించడంలో జింక్ సహాయపడుతుంది.

జింక్ అధికంగా ఉన్న వెజిటేరియన్ ఆహారాల గురించి తెలుసా? 2/7

సాధారణంగా జింక్ మాంసాహారంలో ఎక్కువగా లభిస్తుంది. కానీ కొన్ని శాకాహార ఆహారాలలో కూడా జింక్ ఉంటుంది.

జింక్ అధికంగా ఉన్న వెజిటేరియన్ ఆహారాల గురించి తెలుసా? 3/7

చిక్కుళ్లు.. శనగలు, కాయ ధాన్యాలు, బీన్స్ మొదలైనవాటిలో ప్రోటీన్స్ మాత్రమే కాకుండా జింక్ కూడా పుష్కలంగా ఉంటుంది. జింక్ శోషణ పెరగాలంటే బెల్ పెప్పర్, టమోటాలు, విటమిన్-సి అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.

జింక్ అధికంగా ఉన్న వెజిటేరియన్ ఆహారాల గురించి తెలుసా? 4/7

విత్తనాలు.. జనపనార, గుమ్మడి, నువ్వులు మొదలైనవాటిలో జింక్ సమృద్దిగా ఉంటుంది. వీటిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. ఇవి గుండెను, మెదడును ఆరోగ్యంగాఉంచుతాయి.

జింక్ అధికంగా ఉన్న వెజిటేరియన్ ఆహారాల గురించి తెలుసా? 5/7

నట్స్.. జీడిపప్పు, బాదం పప్పులలో ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియంతో పాటు జింక్ కూడా లభిస్తుంది.

జింక్ అధికంగా ఉన్న వెజిటేరియన్ ఆహారాల గురించి తెలుసా? 6/7

పాలు, పాల ఉత్పత్తులు.. జున్ను, పాలు.. కాల్షియం ను మాత్రమే కాకుండా జింక్ ను కూడా అందిస్తాయి.

జింక్ అధికంగా ఉన్న వెజిటేరియన్ ఆహారాల గురించి తెలుసా? 7/7

తృణధాన్యాలు.. క్వినోవా, బ్రౌన్ రైస్, ఓట్స్ మొదలైన వాటిలో జింక్ సమృద్దిగా ఉంటుంది. జింక్ శోషణను నిరోధించే పైటేట్ లు ఇందులో ఉంటాయి. అందుకే ముందుగా వీటిని నానబెట్టి తరువాత ఆహారంలో తీసుకోవాలి.

Updated at - Oct 14 , 2024 | 03:58 PM