కివి పండును ఎవరు తింటే మంచిదో తెలుసా?

ABN, Publish Date - Sep 16 , 2024 | 01:30 PM

పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఒక్కో పండు కొన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వైరల్ అవుతున్న పండ్లలో కివి పండు కూడా ఉంది. ధర ఎక్కువే అయినా దీని లాభాలు చాలా ఎక్కువ అని ఆహార నిపుణులు అంటున్నారు.

కివి పండును ఎవరు తింటే మంచిదో తెలుసా? 1/9

కివి పండును 8 రకాల వ్యక్తులు తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి.

కివి పండును ఎవరు తింటే మంచిదో తెలుసా? 2/9

రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు కివి పండును తింటే రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఇందులో అధిక మొత్తంలో విటమిన్-సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

కివి పండును ఎవరు తింటే మంచిదో తెలుసా? 3/9

కివి పండులో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. జీర్ణసమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు కివి పండును తింటే జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది.

కివి పండును ఎవరు తింటే మంచిదో తెలుసా? 4/9

గుండె పోటును నియంత్రించడంలో కూడా కివి సహాయపడుతుంది. ఇందులో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది.

కివి పండును ఎవరు తింటే మంచిదో తెలుసా? 5/9

కివి లో విటమిన్-ఇ, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. చర్మం ఆరోగ్యంగా యవ్వనంగా ఉండాలని అనుకునే వారు కివి తింటే మంచిది.

కివి పండును ఎవరు తింటే మంచిదో తెలుసా? 6/9

కివిలో లుటిన్, జియాక్సంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరచడంలోో సహాయపడతాయి.

కివి పండును ఎవరు తింటే మంచిదో తెలుసా? 7/9

కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కివి తింటే బరువు తగ్గుతారు. అధిక బరువుతో ఇబ్బంది పడేవారు కివి తీసుకుంటే మంచిది.

కివి పండును ఎవరు తింటే మంచిదో తెలుసా? 8/9

కివిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. మధుమేహం ఉన్నవారు కివి తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

కివి పండును ఎవరు తింటే మంచిదో తెలుసా? 9/9

కివిలో ఉండే పోషకాలు ఆస్తమా రోగులకు చాలా మేలు చేస్తాయి. ఆస్తమా ఉన్నవారు కివి తీసుకోవచ్చు.

Updated at - Sep 16 , 2024 | 01:30 PM