బట్టతల మీద మళ్లీ జుట్టు పెరుగుతుందా? ఈ చిట్కాలు ట్రై చేయండి..!

ABN, Publish Date - Sep 02 , 2024 | 10:48 AM

బట్టతల ఒకప్పుడు చాలా అరుదుగా కనిపించేది. ఇప్పుడు మాత్రం చాలా మందిలో బట్టతల సమస్య కనిపిస్తోంది. ఆడవాళ్లు కూడా దీని బారిన పడుతున్నారు. చిన్న వయసులోనే బట్టతల వచ్చిన వారు తిరిగి జుట్టు పొందడానికి నానా అవస్థ పడుతుంటారు.

బట్టతల మీద మళ్లీ జుట్టు పెరుగుతుందా? ఈ చిట్కాలు ట్రై చేయండి..! 1/7

జుట్టు విపరీతంగా రాలిపోవడం వల్ల, జుట్టు చాలా పలుచగా, సున్నితంగా మారడం వల్ల బట్టతల వస్తుంది. బట్టతల నివారణకు వైద్యులను సంప్రదించే ముందు కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి.

బట్టతల మీద మళ్లీ జుట్టు పెరుగుతుందా? ఈ చిట్కాలు ట్రై చేయండి..! 2/7

ఉసిరి, నిమ్మరసం.. ఉసిరి, నిమ్మరసం రెండింటిని మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. దీని వల్ల హెయిర్ ఫోలికల్స్ యాక్టివేట్ అవుతాయి. ఈ మిశ్రమాన్ని అప్లై చేసిన 30 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో కడగాలి. హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది. జుట్టు ఆరోగ్యంగా పెరగడంలో సహకరిస్తుంది. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటాన్ని కూడా ఆపుతుంది

బట్టతల మీద మళ్లీ జుట్టు పెరుగుతుందా? ఈ చిట్కాలు ట్రై చేయండి..! 3/7

ఉల్లిపాయ రసం.. ఉల్లిపాయ లో అధిక మొత్తంలో సల్ఫర్ ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఉల్లిపాయ రసాన్ని తలకు పట్టించి 15-20 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తరువాత కడిగేయాలి. ఇది జుట్టు వాల్యూమ్ పెంచడంలో సహాయపడుతుంది. జుట్టు దృఢంగా మారుస్తుంది. తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది.

బట్టతల మీద మళ్లీ జుట్టు పెరుగుతుందా? ఈ చిట్కాలు ట్రై చేయండి..! 4/7

అలోవేరా జెల్.. అలోవేరా జెల్ ను తలకు పట్టించడం వల్ల తల చర్మం హైడ్రేట్ గా ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలను అందిస్తుంది.

బట్టతల మీద మళ్లీ జుట్టు పెరుగుతుందా? ఈ చిట్కాలు ట్రై చేయండి..! 5/7

కొబ్బరినూనె, మెంతులు.. మెంతి గింజలను గ్రైండ్ చేయాలి. ఈ పొడిని కొబ్బరినూనె లో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని స్టౌ పైన సన్నని మంట మీద వేడి చేయాలి. దీన్ని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే షాంపూతో తలస్నానం చేయాలి.

బట్టతల మీద మళ్లీ జుట్టు పెరుగుతుందా? ఈ చిట్కాలు ట్రై చేయండి..! 6/7

గ్రీన్ టీ.. గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. గ్రీన్ టీని జుట్టు మూలాలపై అప్లై చేసి 1 గంట పాటూ అలాగే ఉంచాలి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. జుట్టు రాలడం ఆగిపోతుంది.

బట్టతల మీద మళ్లీ జుట్టు పెరుగుతుందా? ఈ చిట్కాలు ట్రై చేయండి..! 7/7

ఆహారం.. ఆహారంలో ప్రోటీన్, విటమిన్-బి, జింక్, ఐరన్ ను బాగా తీసుకోవడం వల్ల జుట్టు మూలాలు బలోపేతం అవుతాయి. కొత్త జుట్టు పెరగడంలో సహాయపడుతుంది.

Updated at - Sep 02 , 2024 | 10:48 AM