ఈ నాలుగు రకాల విత్తనాలు తింటే చాలు.. జుట్టు వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది..!

ABN, Publish Date - Aug 23 , 2024 | 05:24 PM

జుట్టు అందంగా, ఆరోగ్యంగా పెరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగా లేకపోవడం జుట్టు పెరుగుదలను, జుట్టు స్థితిని దెబ్బ తీస్తుంది. అయితే జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి కేవలం నాలుగు రకాల విత్తనాలను రోజూ తీసుకుంటే చాలని కేశ సంరక్షణ నిపుణులు అంటున్నారు.

ఈ నాలుగు రకాల విత్తనాలు తింటే చాలు.. జుట్టు వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది..! 1/5

నాలుగు రకాల విత్తనాలు తీసుకుంటే జుట్టు పెరుగుదల మెరుగవుతుంది. ఈ విత్తనాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

ఈ నాలుగు రకాల విత్తనాలు తింటే చాలు.. జుట్టు వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది..! 2/5

అవిసె గింజలు.. అవిసె గింజలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి జుట్టు స్కాల్ప్ ఆరోగ్యంగా ఉంచటంలో, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. జుట్టును బలంగా కూడా ఉంచుతాయి.

ఈ నాలుగు రకాల విత్తనాలు తింటే చాలు.. జుట్టు వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది..! 3/5

గుమ్మడి గింజలు.. గుమ్మడి గింజలలో జుట్టు పెరుగుదలకు మేలు చేసే కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్-బి, మెగ్నీషియం, ఐరన్, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి జుట్టు పల్చబడటాన్ని నిరోధించి జుట్టు ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడతాయి.

ఈ నాలుగు రకాల విత్తనాలు తింటే చాలు.. జుట్టు వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది..! 4/5

మెంతి గింజలు.. మెంతి గింజలలో నికోటినిక్ యాసిడ్, లెసిథిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకు ప్రోటీన్ ను సరఫరా చేస్తాయి. జుట్టు రాలడాన్ని నివారించి జుట్టు పెరగడానికి సహాయపడతాయి. జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఈ నాలుగు రకాల విత్తనాలు తింటే చాలు.. జుట్టు వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది..! 5/5

నువ్వులు.. నువ్వులను ఆహారంలో తీసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. నువ్వులలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, పైటోస్టెరాల్స్, పాలీఅన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు సహకరిస్తాయి.

Updated at - Aug 23 , 2024 | 05:24 PM