ఒంట్లో నీరసంగా అనిపిస్తుందా? ఈ 5 ఆహారాలు తినండి చాలు.. శరీరంలో శక్తి నిండుకుంటుంది..!

ABN, Publish Date - Aug 17 , 2024 | 09:10 AM

ఆహారం శరీరానికి శక్తి వనరు. రోజూ వేళకు ఆహారం తీసుకుంటున్నా, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నా కొందరు బలహీనత ఫీలవుతుంటారు. శరీరమంతా ఎప్పుడూ నీరసంగా, ఒంట్లో శక్తి లేనట్లు అనిపిస్తుంది. అయితే సాధారణంగా అందరికీ అందుబాటులో ఉండే కొన్ని సూపర్ ఫుడ్స్ ఉన్నాయి. వీటిని తీసుకుంటే శరీరం శక్తితో నిండిపోతుంది. వాటి మీద ఓ లుక్కేస్తే..

ఒంట్లో నీరసంగా అనిపిస్తుందా? ఈ 5 ఆహారాలు తినండి   చాలు.. శరీరంలో శక్తి నిండుకుంటుంది..! 1/5

ఖర్జూరాలు.. ఖర్జూరాన్ని రాత్రిపూట నీళ్లలో నానబెట్టాలి. ఉదయాన్నే వాటిని తినాలి. ఖర్జూరంలో విటమిన్లు, కాల్షియం, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా చాలా మొత్తంలో ఉంటాయి. సాధారణ ఖర్జూరం కంటే నానబెట్టిన ఖర్డూరం తినడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి.

ఒంట్లో నీరసంగా అనిపిస్తుందా? ఈ 5 ఆహారాలు తినండి   చాలు.. శరీరంలో శక్తి నిండుకుంటుంది..! 2/5

డ్రై నట్స్.. బాదం, వాల్నట్స్ వంటి డ్రై నట్స్ శరీరానికి చాలా బలాన్ని ఇస్తాయి. వీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి. డ్రై నట్స్ శరీరానికి ప్రోటీన్లు, కాల్షియం, అవసరమైన విటమిన్లు అందిస్తాయి. ఇవి శరీరంలో ఎక్కువసేపు శక్తిని నిలిపి ఉంచుతాయి.

ఒంట్లో నీరసంగా అనిపిస్తుందా? ఈ 5 ఆహారాలు తినండి   చాలు.. శరీరంలో శక్తి నిండుకుంటుంది..! 3/5

అరటిపండు.. అరటిపండ్లు తక్షణ శక్తిని ఇస్తాయి. ఇందులో మంచి మొత్తంలో పొటాషియం, ఫైబర్, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు ఉన్నాయి. ఇవి శక్తిని పెంచుతాయి.

ఒంట్లో నీరసంగా అనిపిస్తుందా? ఈ 5 ఆహారాలు తినండి   చాలు.. శరీరంలో శక్తి నిండుకుంటుంది..! 4/5

చిలకడదుంపలు.. బలహీనంగా ఉన్న శరీరానికి శక్తిని ఇవ్వడంలో చిలకడ దుంపలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. చిలకడదుంపలలో మంచి మొత్తంలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, పొటాషియం ఉంటాయి. ఇవి బలహీనత తొలగిస్తాయి.

ఒంట్లో నీరసంగా అనిపిస్తుందా? ఈ 5 ఆహారాలు తినండి   చాలు.. శరీరంలో శక్తి నిండుకుంటుంది..! 5/5

పాలకూర.. పాలకూర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర కణాలకు ఆక్సిజన్ తీసుకువెళ్లడంలో సహాయపడుతుంది. చాలామందిలో ఐరన్ లోపం వల్లే బలహీనత ఏర్పడుతుంది.

Updated at - Aug 17 , 2024 | 09:10 AM