క్యాన్సర్ బాధితులకు గుడ్ న్యూస్.. ఉచితంగా వ్యాక్సిన్..
ABN, Publish Date - Dec 19 , 2024 | 12:17 PM
క్యాన్సర్ ట్రీట్‌మెంట్ ఇక మీదట మరింత సులభతరం కానుంది. పైసా ఖర్చు పెట్టకుండానే క్యాన్సర్ బారి నుంచి బయటపడొచ్చు. ఉచిత క్యాన్సర్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుండటమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో ఆ వ్యాక్సిన్ ఏంటి? ఎవరు రూపొందించారు? ఎక్కడ అందుబాటులోకి రానుంది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..
![క్యాన్సర్ బాధితులకు గుడ్ న్యూస్.. ఉచితంగా వ్యాక్సిన్..](https://media.andhrajyothy.com/media/2024/20241209/03_a5ac604a24_v_jpg.webp)
ప్రాణాంతర వ్యాధుల్లో ఒకటిగా క్యాన్సర్‌ను చెప్పొచ్చు. దీని బారిన పడితే కోలుకోవడం అంత ఈజీ కాదు.
![క్యాన్సర్ బాధితులకు గుడ్ న్యూస్.. ఉచితంగా వ్యాక్సిన్..](https://media.andhrajyothy.com/media/2024/20241209/02_9e181e401d_v_jpg.webp)
క్యాన్సర్ ట్రీట్‌మెంట్ ఇక మీదట మరింత సులభతరం కానుంది. పైసా ఖర్చు పెట్టకుండానే క్యాన్సర్ బారి నుంచి బయటపడొచ్చు.
![క్యాన్సర్ బాధితులకు గుడ్ న్యూస్.. ఉచితంగా వ్యాక్సిన్..](https://media.andhrajyothy.com/media/2024/20241209/03_522b30bf9b_v_jpg.webp)
రష్యా క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఈ విషయాన్ని న్యూస్ ఏజెన్సీ టాస్ బయటపెట్టింది.
![క్యాన్సర్ బాధితులకు గుడ్ న్యూస్.. ఉచితంగా వ్యాక్సిన్..](https://media.andhrajyothy.com/media/2024/20241209/04_8869fbcb83_v_jpg.webp)
క్యాన్సర్‌ను నయం చేయడానికి ఎంఆర్‌ఎన్‌ఏ అనే టీకాను రష్యా డెవలప్ చేస్తోందని సమాచారం.
![క్యాన్సర్ బాధితులకు గుడ్ న్యూస్.. ఉచితంగా వ్యాక్సిన్..](https://media.andhrajyothy.com/media/2024/20241209/05_2cbab57154_v_jpg.webp)
క్యాన్సర్ రోగులకు ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించేందుకు పుతిన్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని వినిపిస్తోంది.
![క్యాన్సర్ బాధితులకు గుడ్ న్యూస్.. ఉచితంగా వ్యాక్సిన్..](https://media.andhrajyothy.com/media/2024/20241209/06_64a4081728_v_jpg.webp)
2025 ఆరంభంలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది.
![క్యాన్సర్ బాధితులకు గుడ్ న్యూస్.. ఉచితంగా వ్యాక్సిన్..](https://media.andhrajyothy.com/media/2024/20241209/07_cf5eb213d6_v_jpg.webp)
పలు పరిశోధనా సంస్థలతో కలసి రష్యన్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ ఈ టీకాను అభివృద్ధి చేసిందని సమాచారం.
![క్యాన్సర్ బాధితులకు గుడ్ న్యూస్.. ఉచితంగా వ్యాక్సిన్..](https://media.andhrajyothy.com/media/2024/20241209/08_3af9940ed1_v_jpg.webp)
ఎంఆర్ఎన్‌ఏ వ్యాక్సిన్‌పై రష్యా ఇప్పటికే చాలా మార్లు ప్రీ-క్లినికల్ ట్రయల్స్ జరిపిందని తెలుస్తోంది.
![క్యాన్సర్ బాధితులకు గుడ్ న్యూస్.. ఉచితంగా వ్యాక్సిన్..](https://media.andhrajyothy.com/media/2024/20241209/09_778536cd1a_v_jpg.webp)
విస్తృతంగా పరిశోధనలు, ట్రయల్స్ చేశాకే దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని డిసైడ్ అయిందట అక్కడ ప్రభుత్వం.
![క్యాన్సర్ బాధితులకు గుడ్ న్యూస్.. ఉచితంగా వ్యాక్సిన్..](https://media.andhrajyothy.com/media/2024/20241209/10_5e76155478_v_jpg.webp)
ఆరంభంలో క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
![క్యాన్సర్ బాధితులకు గుడ్ న్యూస్.. ఉచితంగా వ్యాక్సిన్..](https://media.andhrajyothy.com/media/2024/20241209/11_27b0d9c44b_v_jpg.webp)
క్యాన్సర్ టీకా తయారీ దాదాపుగా పూర్తయిందన్నారు. అప్పటి నుంచి దీని కోసం అందరూ ఎదురుచూడసాగారు.
![క్యాన్సర్ బాధితులకు గుడ్ న్యూస్.. ఉచితంగా వ్యాక్సిన్..](https://media.andhrajyothy.com/media/2024/20241209/12_31eab177ca_v_jpg.webp)
ఇతర దేశాలకు ఫ్రీగా సరఫరా చేయకపోయినా.. చాలా తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
Updated at - Dec 19 , 2024 | 12:17 PM