శరదృతువులో జబ్బులు రాకూడదంటే.. ఈ సూపర్ ఫుడ్స్ తినండి..!

ABN, Publish Date - Oct 04 , 2024 | 05:12 PM

వాతావరణంలో చోటు చేసుకునే మార్పువు చాలా వరకు అనారోగ్యాలకు కారణం అవుతాయి. ఏ సీజన్ లో దొరికే పండ్లు, కూరగాయలు ఆ సీజన్ లో తినడం మంచిదని పెద్దలు చెబుతూనే ఉంటారు. కానీ నేటి కాలం హైబ్రిడ్ పంటల కారణంగా సీజన్ లో దొరనివి కూడా కొన్ని మార్కెట్లలో లభిస్తుంటాయి. ఆహారం మీద ఇష్టం కొద్దీ కొన్ని పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసి తింటారు.

శరదృతువులో జబ్బులు రాకూడదంటే.. ఈ సూపర్ ఫుడ్స్ తినండి..! 1/9

శరదృతువులో వాతావరణం చాలా చల్గగా మారుతుంది. ఒకవైపు వర్షాలు.. మరొక వైపు చలి, చల్లని వాతావరణం కారణంగా సీజనల్ సమస్యలు కూడా వస్తాయి. సీజనల్ సమస్యలు రాకూడదంటే శరదృతువులో కొన్ని సూపర్ ఫుడ్స్ తీసుకోవాలి.

శరదృతువులో జబ్బులు రాకూడదంటే.. ఈ సూపర్ ఫుడ్స్ తినండి..! 2/9

గుమ్మడి కాయలు.. గుమ్మడి కాయలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కంటి ఆరోగ్యానికి మంచిది. ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది జీర్ణక్రియకు మంచిది.

శరదృతువులో జబ్బులు రాకూడదంటే.. ఈ సూపర్ ఫుడ్స్ తినండి..! 3/9

యాపిల్స్.. యాపిల్స్ లో ఫైబర్, క్వెర్సెటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. మంటను తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి.

శరదృతువులో జబ్బులు రాకూడదంటే.. ఈ సూపర్ ఫుడ్స్ తినండి..! 4/9

చిలకడదుంపలు.. విటమిన్-ఎ, పొటాషియం, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల చిలగడదుంపలు రక్తపోటును నియంత్రిస్తాయి. జీర్ణక్రియను మెరుగ్గా ఉంచుతాయి.

శరదృతువులో జబ్బులు రాకూడదంటే.. ఈ సూపర్ ఫుడ్స్ తినండి..! 5/9

బ్రెస్సెల్స్ మొలకలు.. బ్రెస్సెల్స్ మొలకలు ఫైబర్, విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి.

శరదృతువులో జబ్బులు రాకూడదంటే.. ఈ సూపర్ ఫుడ్స్ తినండి..! 6/9

బేరి పండ్లు.. బేరి పండ్లలో ఫైబర్, విటమిన్-సి పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు, రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ సహాయపడతాయి. సహజమైన తీపి వల్ల మధుమేహం ఉన్నవారికి కూడా మంచివి.

శరదృతువులో జబ్బులు రాకూడదంటే.. ఈ సూపర్ ఫుడ్స్ తినండి..! 7/9

క్రాన్బెర్రీస్.. బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. మూత్రనాళాల ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

శరదృతువులో జబ్బులు రాకూడదంటే.. ఈ సూపర్ ఫుడ్స్ తినండి..! 8/9

దానిమ్మ.. దానిమ్మలో యాంటీ ఆక్సిడెటంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి ధీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

శరదృతువులో జబ్బులు రాకూడదంటే.. ఈ సూపర్ ఫుడ్స్ తినండి..! 9/9

అక్రోట్లు.. వాల్ నట్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ లు తగ్గిస్తాయి. చల్లని వాతావరణంలో మెదడు, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Updated at - Oct 04 , 2024 | 05:12 PM