ఈ భారతీయ ఆహారాల ముందు ఫారిన్ సూపర్ ఫుడ్స్ బలాదూర్..!

ABN, Publish Date - Aug 28 , 2024 | 11:53 AM

ఆహారమే ఆరోగ్యం అంటారు. విదేశాలలో కొన్ని ఆహారాలను సూపర్ ఫుడ్స్ గా పేర్కొంటారు. ఈ కారణంగా అవి ఖరీదు అయినా భారతీయులు కూడా వాటిని కొనుగోలు చేసి తింటుంటారు. అయితే ఫారిన్ ఆహారాలను తల దన్నే భారతీయ సూపర్ ఫుడ్స్ కొన్ని ఉన్నాయి.

ఈ భారతీయ ఆహారాల ముందు  ఫారిన్ సూపర్ ఫుడ్స్ బలాదూర్..! 1/6

ఈ భారతీయ ఆహారాల ముందు ఫారిన్ సూపర్ ఫుడ్స్ కూడా బలాదూర్ అవుతాయి. అవేంటంటే..

ఈ భారతీయ ఆహారాల ముందు  ఫారిన్ సూపర్ ఫుడ్స్ బలాదూర్..! 2/6

మునగ.. భారతదేశంలో మునగ విదేశీ సూపర్ ఫుడ్స్ ను తలదన్నే పోషకాలు కలిగి ఉంటుంది. ఇందులో విటమిన్-ఎ, సి, ఇ, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఈ భారతీయ ఆహారాల ముందు  ఫారిన్ సూపర్ ఫుడ్స్ బలాదూర్..! 3/6

అమరాంత్ లేదా రాజ్ గిరా.. ఈ మధ్యన వైరల్ అవుతున్న విదేశీ ఫుడ్ క్వినోవాకు అమరాంత్ చాలా మంచి ప్రత్యామ్నాయం. వీటిలో ప్రోటీన్ పైబర్, ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అధికంగా ఉంటాయి.

ఈ భారతీయ ఆహారాల ముందు  ఫారిన్ సూపర్ ఫుడ్స్ బలాదూర్..! 4/6

తులసి.. వైరల్ అవుతున్న ఫారిన్ మాచా టీ లాగానే తులసిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఒత్తిడిని తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ఈ భారతీయ ఆహారాల ముందు  ఫారిన్ సూపర్ ఫుడ్స్ బలాదూర్..! 5/6

ఉసిరి.. ఫారిన్ బెర్రీ జాతి పండ్లకు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. కానీ భారతీయ ఉసిరి వీటికి ధీటుగా నిలుస్తుంది. ఉసిరి విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లకు పవర్ హౌస్.

ఈ భారతీయ ఆహారాల ముందు  ఫారిన్ సూపర్ ఫుడ్స్ బలాదూర్..! 6/6

సబ్జా.. చియా సీడ్స్ కు సబ్జా విత్తనాలు మంచి ప్రత్యామ్నాయం. వీటిలో ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.

Updated at - Aug 28 , 2024 | 11:54 AM