TS Politics: బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఆరూరి రమేశ్
ABN , Publish Date - Mar 14 , 2024 | 12:04 PM
ఆరూరి రమేశ్ వ్యవహారంలో (Aroori Ramesh) కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్‌కు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఆయన బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. బీజేపీలో చేరేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు. బీజేపీలో చేరేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. మరికాసేపట్లో బీజేపీ అధిష్ఠాన పెద్దలను కలిసి కాషాయ కండువాను కప్పుకోనున్నారు.
వరంగల్: మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ వ్యవహారంలో (Aroori Ramesh) కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్‌కు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఆయన బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. బీజేపీలో చేరేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు. బీజేపీలో చేరేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. మరికాసేపట్లో బీజేపీ అధిష్ఠాన పెద్దలను కలిసి కాషాయ కండువాను కప్పుకోనున్నారు. బీఆర్ఎస్ తనను అవమాన పరిచిందని ఆరూరి రమేశ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కాగా ఆరూరి రమేశ్ పస్తుతం వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు.
కాగా ఆరూరి రమేశ్ వ్యవహారంలో బుధవారమంతా హైడ్రామా నెలకొన్న విషయం తెలిసిందే. బీజేపీలో చేరబోతున్నట్టు ప్రకటన చేసేందుకు సిద్ధమై మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆరూరి రమేశ్‌ను బీఆర్ఎస్ నేతలు అడ్డగించారు. బలవంతంగా కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్లారు. కేసీఆర్‌తో సమావేశం అనంతరం తాను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని ఆరూరి రమేష్ ప్రకటించారు. తాను బీజేపీ అగ్రనేత అమిత్ షాను కలవలేదని అన్నారు. కేసీఆర్‌ను నమ్మించి అక్కడి నుంచి బయటపడ్డ ఆరూరి రమేశ్ సైలెంట్‌గా ఢిల్లీకి వెళ్లడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి
Phone Tapping Case: కీలక విషయాలు వెల్లడించిన ప్రణీత్‌రావు
Bura Narsaiah: బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటే అన్న వారిని చెప్పుతో కొడతాం
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి