Home » Aroori Ramesh
తెలంగాణలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌కు ప్రస్తుతం గ్రహస్థితి అనుకూలిస్తున్నట్లు లేదు. ఓవైపు కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు సీనియర్ నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్, బీజేపీ(BJP)లో చేరుతున్నారు. ఇప్పటికే నాగర్‌కర్నూల్, జహీరాబాద్ ఎంపీలు రాములు, బీబీ పాటిల్‌తో పాటు మరికొంతమంది సీనియర్లు బీజేపీలో చేరగా.. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్‌లో చేరారు.
ఆరూరి రమేశ్ వ్యవహారంలో (Aroori Ramesh) కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్‌కు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఆయన బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. బీజేపీలో చేరేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు. బీజేపీలో చేరేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. మరికాసేపట్లో బీజేపీ అధిష్ఠాన పెద్దలను కలిసి కాషాయ కండువాను కప్పుకోనున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు(KCR) కొత్త కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా పార్టీని వీడిపోతున్న నేతలను కంట్రోల్ చేయడం గులాబీ దళపతికి ఇబ్బందిగా పరిణమిస్తోంది. పార్టీ మారుతారంటూ వార్త అందడమే ఆలస్యం.. ఆ నేతలను పిలిపించుకుని మాట్లాడుతున్నారు కేసీఆర్. తాజాగా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్(Aroori Ramesh) బీఆర్ఎస్(BRS)ను వీడి.. బీజేపీ(BJP)లో చేరుతారంటూ వార్తలు వచ్చాయి.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీ మార్పు వార్తలపై ఉత్కంఠ వీడింది. కేసీఆర్‌తో సమావేశం అనంతరం తాను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని ఆరూరి రమేష్ ప్రకటించారు. ముఖ్యంగా తాను బీజేపీ అగ్రనేత అమిత్ షాను కలవలేదని చెప్పారు.
తెలంగాణ రాజకీయాల్లో హైడ్రామా నెలకొంది. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కోసం చేజింగ్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఆరూరి రమేష్ కేంద్రంగా ఉదయం నుంచి హైడ్రామా నెలకొంది. దీంతో ఆరూరి పార్టీ మార్పుపై దాగుడుమూతలు కొనసాగుతున్నాయి.
వరంగల్: బీఆర్ఎస్ (BRS)కు వస్తున్న ప్రజాధారణ చూసి ఓర్వలేకనే ప్రభుత్వంపై బీజేపీ (BJP) బురదజల్లుతోందని వర్థన్నపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ (MLA Aroori Ramesh) అన్నారు.