Share News

Indravelli Meeting live updates: మొత్తం దోచుకున్నారు.. కాంగ్రెస్‌కు నిధులు లేకుండా చేశారు: రేవంత్

ABN , First Publish Date - Feb 02 , 2024 | 04:39 PM

Congress Party Indravelli Public Meeting: తెలంగాణలో త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో సత్తా చాటి.. ప్రజలు తమవైపే ఉన్నారని చాటుకోవడానికి బీఆర్ఎస్ భగీరథ ప్రయత్నాలు చేస్తోంది. ఇక కాంగ్రెస్ మాత్రం.. ‘అసెంబ్లీలో మాదే.. పార్లమెంట్‌లో కూడా మాదే..’ అని నిరూపించుకోవడానికి వ్యూహ రచన చేస్తోంది. ఇందులో భాగంగా.. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచి కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల శంఖారావం మోగిస్తోంది..

Indravelli Meeting live updates: మొత్తం దోచుకున్నారు.. కాంగ్రెస్‌కు నిధులు లేకుండా చేశారు: రేవంత్

Live News & Update

  • 2024-02-02T17:30:07+05:30

    రాంజీగోండ్‌ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకున్నా: రేవంత్‌రెడ్డి

    ఆదిలాబాద్‌ను దత్తత తీసుకుంటాం

    ఆదివాసీ ప్రాంతాన్ని అభివృద్ధివైపు నడిపించే బాధ్యత తీసుకుంటాం

    1981 ఇంద్రవెల్లి దారుణంపై ఆనాడే క్షమాపణ చెప్పాను

    ఆనాడు సీమాంధ్ర పాలకుల పాలనలో ఆ తప్పు జరిగింది

    అమరవీరుల స్తూపం సాక్షిగా కేసీఆర్‌ పాలనను అంతం చేశాం

    కేసీఆర్‌ కుటుంబం కోసమే రాష్ట్రం వచ్చిందా?

  • 2024-02-02T17:29:27+05:30

    కేసీఆర్‌ పదేళ్లలో ఏమీ చేయలేదు.. మేము 2 నెలల్లో ఎలా చేస్తాం?: రేవంత్

    కాంగ్రెస్ వచ్చి 2 నెలలు కాలేదు.. అప్పుడే విమర్శలు మొదలుపెట్టారు

    15 రోజుల్లో 15వేల కానిస్టేబుల్‌ ఉద్యోగాలు భర్తీ చేస్తాం

    త్వరలోనే రూ. 500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తాం

    200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌ త్వరలో అమలు చేస్తాం

  • 2024-02-02T17:28:31+05:30

    కాంగ్రెస్ ప్రభుత్వానికి నిధులు లేకుండా చేశారు: రేవంత్ రెడ్డి

    మిషన్ భగీరథ పేరుతో రూ. 40 వేల కోట్లు దోచుకున్నారు.

    7 లక్షల కోట్ల అప్పుల తెలంగాణగా మార్చారు.

    తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం విధ్వంసం చేసింది.

    పదేళ్ల దుర్మార్గ పాలనకు ప్రజలు చరమగీతం పాడారు.

    మీ సొంత కుటుంబం కోసం తెలంగాణ వచ్చిందా?

    పదేళ్ల పాలనలో కేసీఆర్ సర్కార్ అడవి బిడ్డలను పట్టించుకోలేదు.

    విద్యార్థులు, నిరుద్యోగులకు మాత్రం మొండిచేయి చూపారు.

    ప్రజలు కవితను ఓడించినా ఎమ్మెల్సీతో ఉద్యోగం ఇచ్చారు.

  • 2024-02-02T17:27:16+05:30

    7వేల మంది స్టాఫ్ నర్సుల ఉద్యోగాలిచ్చాం.. సీఎం రేవంత్ రెడ్డి..

    15 రోజుల్లో 15వేల కానిస్టేబుళ్ల ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత మాదే.

    వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చేందుకు కోర్టు కేసులు పరిష్కరిస్తున్నాం

    వేలాది మంది నిరుద్యోగుల ఉపాధి కోసం చర్యలు తీసుకుంటున్నాం.

    15వేల కానిస్టేబుళ్ల ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదు.

    7వేల మంది స్టాఫ్ నర్సులకు మేం ఉద్యోగాలు ఇచ్చాం

  • 2024-02-02T17:25:39+05:30

    చెప్పిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు: రేవంత్ రెడ్డి

    ఇంద్రవెల్లి వేదికగా కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం.

    అమరవీరుల ఆశయాలను కాంగ్రెస్ పూర్తి చేసింది.

    చెప్పిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు.

    ఆ కృతజ్ఞతతోనే ఇప్పుడు కాంగ్రెస్‌కు అధికారం అప్పగించారు.

    అన్ని వర్గాల ప్రజలు మెచ్చేలా చర్యలు తీసుకుంటాం.

    అమరవీరుల పోరాట స్ఫూర్తితో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం.

    జల్, జమీన్, జంగల్ నినాదంతో కొమురంభీమ్ పోరాటం చేశారు.

    ఇంద్రవెల్లి గాలి, నీటిలో పౌరుషం ఉంది.

  • 2024-02-02T17:15:52+05:30

    కేస్లాపూర్‌లో మహిళా సంఘాలతో రేవంత్‌రెడ్డి ముఖాముఖి..

    మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనేదే కాంగ్రెస్‌ ఉద్దేశం

    స్వయంసహాయక బృందాలకే యూనిఫామ్‌లు కుట్టే అవకాశం ఇస్తాం

    మహిళలకు ఉచిత బస్సు రద్దు చేయాలని బీఆర్ఎస్ నేతలంటున్నారు

    బీఆర్ఎస్ నేతలకు ఎందుకు అంత కడుపుమంట?

    గత కాంగ్రెస్‌ సీఎంలు మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చారు

    మహిళలు ఆత్మగౌరవంతో ఉండి ఆదర్శంగా నిలవాలి

    గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1200 మంది.. త్వరలో రూ. 500కే ఇస్తాం

    విద్యుత్‌ 200 యూనిట్ల వరకు మహిళలకు ఉచితంగా ఇస్తాం

  • 2024-02-02T16:45:56+05:30

    ప్రకటన వచ్చేసిందహో..!

    • ఇంద్రవెల్లి బహిరంగ సభకు ముందు స్వయం సహాయక సంఘాల ఆత్మీయ సమావేశంలో సీఎం

    • స్వయం సహాయక సంఘాలకు రూ.60కోట్ల విలువైన బ్యాంకు లింకేజీ చెక్కులను పంపిణీ చేసిన సీఎం

    • స్వయం సహాయక సంఘాలకు పూర్వ వైభవం తీసుకొస్తామన్న రేవంత్ రెడ్డి

    • మహిళలకు అండగా నిలిచేందుకే ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది

    • త్వరలోనే ప్రియాంక గాంధీని పిలిచి రూ.500 లకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తాం

    • ఇందిరమ్మ రాజ్యంలో ఆడ బిడ్డలు ఆత్మ గౌరవంతో బ్రతకాలనేదే మా ఆకాంక్ష

    • త్వరలోనే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తాం

    • స్కూళ్లు, హాస్టళ్ల విద్యార్థుల యూనిఫామ్ కుట్టుపని స్వయం సహాయక సంఘాలకే ఇచ్చేలా నిర్ణయం తీసుకుంటాం

    • మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అడ్డుకోవాలని కొందరు కుట్ర చేస్తున్నారు

    • అలాంటి వారు ఊర్లలోకి వస్తే తగిన బుద్ధి చెప్పండి..

  • 2024-02-02T16:30:57+05:30

    తెలంగాణలో త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో సత్తా చాటి.. ప్రజలు తమవైపే ఉన్నారని చాటుకోవడానికి బీఆర్ఎస్ భగీరథ ప్రయత్నాలు చేస్తోంది. ఇక కాంగ్రెస్ మాత్రం.. ‘అసెంబ్లీ మాదే.. పార్లమెంట్‌ కూడా మాదే..’ అని నిరూపించుకోవడానికి వ్యూహ రచన చేస్తోంది. ఇందులో భాగంగా.. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచి కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల శంఖారావం మోగిస్తోంది. పార్లమెంట్ నియోజకవర్గాల పర్యటనలో తొలి సభ ఇంద్రవెల్లి నుంచే రేవంత్ ప్రారంభించబోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. పోరు గడ్డ నుంచి ప్రచార హోరు మొదలు కానుందన్న మాట. ఇంద్రవెల్లి నుంచే పార్లమెంట్ ఎన్నికల అసలు సినిమా అని కాంగ్రెస్ చెప్పుకుంటోంది. ఈ సభావేదికగా.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు ప్రకటనలు చేస్తారని ఆదిలాబాద్ జిల్లా ప్రజలతో పాటు.. రాష్ట్ర ప్రజలు ఎదురుచూపులు చూస్తున్నారు. ముఖ్యంగా.. రెండు గ్యారెంటీల అమలుపై సీఎం ప్రకటన చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.. రేవంత్ ప్రసంగం లైవ్‌లో చూడొచ్చు..