AP Politics: పవన్‌పై దూషణలు.. జగన్ గెలుపుపై గట్టి ఎఫెక్ట్?
ABN , Publish Date - Jan 05 , 2024 | 03:55 PM
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిప్పలు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఓటమి భయంతో నైతికలు విలువలను దిగజార్చి విపక్ష నాయకులపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. మరీ ముఖ్యంగా టీడీపీ-జనసేన పోటీ చేయనుండడం ఖరారైన తర్వాత సీఎం జగన్ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(jagan mohan reddy)కి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో(assembly elections) తిప్పలు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఓటమి భయంతో నైతికలు విలువలను దిగజార్చి విపక్ష నాయకులపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. మరీ ముఖ్యంగా టీడీపీ-జనసేన పోటీ చేయనుండడం ఖరారైన తర్వాత సీఎం జగన్ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు. జనసేనాని పవన్‌పై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఈ విధమైన వ్యవహార ధోరణి సొంత పార్టీ నేతలకు కూడా రుచించడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇలాంటి వ్యాఖ్యలకు ఓట్లు పడవని, పైగా రాబోయే ఎన్నికల్లో నష్టం కలిగిస్తాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Mlas House: ఎమ్మెల్యే ఇంట్లో సోదాలు..కోట్ల రూపాయల నగదు, 300 తుపాకులు లభ్యం
ఎన్నికల వేళ సీఎం జగన్ ఈ విధంగా వ్యక్తిగత దూషణలకు దిగితే ప్రతికూల ప్రభావం ఉంటుందని, విజయావకాశాలను దారుణంగా దెబ్బతీస్తాయని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం కార్యక్రమమే విచక్షణా కూడా రాజకీయ ప్రసంగాలు చేసే జగన్.. మరింత దిగజారి వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తే వచ్చే ప్రయోజనం ఏమీ లేదని అభిప్రాయపడుతున్నారు. పవన్(pawan) పెళ్లిళ్లు, భార్యల గురించి ప్రస్తావించడం ఆహ్వానించదగినది కాదంటున్నారు. రాజకీయాల్లో నైతిక విలువలు పాటిస్తేనే గౌరవం ఉంటుందని సూచిస్తున్నారు.
సీఎం జగన్ వ్యక్తిగతంగా చేస్తున్న వ్యాఖ్యల పట్ల జనాలకు రుచించడంలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదంటూ గతంలోనూ ఎన్నో విమర్శలు వచ్చినా జగన్ వాటిని పెడచెవిన పెట్టారు. వివాహం అనేది వ్యక్తిగత విషయమని, పవన్ కల్యాణ్(pawan kalyan) చట్ట ప్రకారం వివాహం చేసుకుంటే దానిపై విమర్శలు గుప్పించడం అనైతికమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తద్వారా జగన్ స్వయంగా తన ప్రతిష్ఠను దిగజార్చుకుంటున్నాని టాక్ వినిపిస్తోంది.
పవన్ వ్యక్తిగత జీవితంపై జగన్ కామెంట్లు చేసినప్పటికీ పవన్ మాత్రం తిరిగి వ్యాఖ్యలు చేయకుండా ఉండటం కూడా పవన్‌కు ప్లస్ అవుతుందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. హూందాగా వ్యవహరిస్తూ పవన్ వ్యక్తిగత ఇమేజ్‌ను మరింత పెరిగిందని అంటున్నారు. పవన్ ఇమేజ్‌ను దెబ్బతిసేందుకు జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఇప్పటికే జనసేన నేతలు చెబుతున్నారు. అంతేకాదు జగన్ ఓటమి భయంతోనే ఇలాంటి వ్యాఖ్యానిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జగన్ ఇకనైనా తన వైఖరిని మార్చుకుంటారో లేదో వేచిచూడాలి.