TDP-Janasena First List Live Updates : సెకండ్ లిస్ట్ కోసం సీనియర్లు వెయిటింగ్.. ఛాన్స్ ఎవరికో..!?
ABN , First Publish Date - Feb 24 , 2024 | 10:55 AM
TDP-Janasena Mla Candidates: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో (AP Elections 2024) ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందేనని టీడీపీ-జనసేన (TDP-Janasena) పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. ఇందుకోసం ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మలుచుకుని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ముందుకెళ్తున్నారు. అధికార వైసీపీ (YSR Congress) అభ్యర్థుల ప్రకటనలో ముందు వరుసలో ఉండటంతో.. తగ్గేదేలే అంటూ తొలి జాబితాను అధినేతలు రిలీజ్ చేశారు. ఈ జాబితాను చూసిన వైసీపీ హైకమాండ్‌లో వణుకు మొదలైందని టీడీపీ శ్రేణులు చెబతున్నాయి. ఇక కాస్కోండి అంటూ వైసీపీకి టీడీపీ, జనసేన శ్రేణులు చాలెంజ్ చేస్తున్నాయి..
Live News & Update
-
2024-02-24T17:45:55+05:30
తుది జాబితాతో వైసీపీ మైండ్ బ్లాంకే: బోండా ఉమ
టీడీపీ-జనసేన కూటమి తొలి జాబితాపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ విడుదల చేసిన మొదటి జాబితాకే తాడేపల్లి ప్యాలెస్ కంపించిపోయిందని.. ఇక తుది జాబితా విడుదలైతే మాత్రం వైసీపీ మైండ్ బ్లాంక్ అవడం ఖాయం అని వ్యాఖ్యానించారు.
-
2024-02-24T17:10:03+05:30
హనుమాన్ జంక్షన్ అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు..
కృష్టా జిల్లా గన్నవరం టీడీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావుని అధికారికంగా ఖరారు చేసిన నేపథ్యంలో హనుమాన్ జంక్షన్ అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పార్టీ శ్రేణులు. టీడీపీ-జనసేన శ్రేణులు యార్లగడ్డ వెంకట్రావుకు ఘన స్వాగతం పలికారు.
-
2024-02-24T16:15:51+05:30
టీడీపీ-జనసేన నేతల సంబరాలు..
అభ్యర్థుల ప్రకటనతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో తేలిపోతున్నారు. టికెట్ దక్కిన నేతల అభిమానులు, పార్టీ కార్యకర్తలు తమ తమ ప్రాంతాల్లో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు.
-
2024-02-24T16:10:00+05:30
చంద్రబాబుకు గిఫ్ట్ ఇస్తా: కన్నా లక్ష్మీనారాయణ
సత్తెనపల్లి టీడీపీ-జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు కన్నా లక్ష్మీనారాయణ. సత్తెనపల్లి టికెట్ తనకు కేటాయించినందుకు చంద్రబాబు, పవన్, లోకేష్‌కు ధన్యవాదాలు తెలిపారు. సత్తెనపల్లిలో ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబుకు గిఫ్ట్ ఇస్తానని అన్నారు.
-
2024-02-24T16:05:04+05:30
టీడీపీ తొలి జాబితాలో చోటు దక్కని కీలక నేతలు వీరే..
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, యరపతినేని శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావ్, గొరంట్ల బుచ్చయ్య చౌదరి. పీతల సుజాత, సీనియర్ నాయకుడు గౌతు లచ్చన్న రాజకీయ వారసురాలు గౌతు శిరీష పేర్లను టీడీపీ అధినేత ప్రకటించలేదు. వీరితో పాటు చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమ, ఆలపాటి రాజ పేర్లను కూడా చంద్రబాబు ప్రకటించలేదు.
-
2024-02-24T16:00:00+05:30
తొలిసారి అసెంబ్లీ ఎన్నికలకు సై అంటున్న 24 మంది నేతలు వీరే..
1. తొయ్యక జగదీశ్వరి కురుపాం2. విజయ్ బోనెల. పార్వతీపురం
3. కొండపల్లి శ్రీనివాస్ - గజపతినగరం
4. యనమల దివ్య - తుని
5. మహాసేన రాజేష్ - పి.గన్నవరం
6. ఆదిరెడ్డి వాసు - రాజమండ్రి సిటీ
7. బడేటి రాధాకృష్ణ - ఏలూరు
8. సొంగ రోషన్ - చింతలపూడి
9. కొలికళాపూడి శ్రీనివాస్ - తిరువూరు
10. వెనిగండ్ల రాము - గుడివాడ
11. వర్ల కుమార్ రాజా - పామర్రు
12. వేగేశ్న నరేంద్ర వర్మ - బాపట్ల
13. గూడూరి ఎరిక్షన్ బాబు - ఎర్రగొండపాలెం
14. కావ్యా కృష్ణ రెడ్డి - కావలి
15. నెలవల విజయశ్రీ - సూళ్లూరుపేట
16. కాకర్ల సురేష్ - ఉదయగిరి
17. మాధవీరెడ్డి - కడప
18. బొగ్గుల దస్తగిరి - కోడుమూరు
19. అమిరినేని సురేంద్ర బాబు - కల్యాణ దుర్గం
20. ఎం. ఈ సునీల్ కుమార్ - మడకశిర
21. సవిత - పెనుగొండ
22. జయచంద్ర రెడ్డి - తంబల్లపల్లి
23. వీఎం థామస్ - జీడీ నెల్లూరు
24. గురజాల జగన్మోహన్ - చిత్తురు
-
2024-02-24T14:30:47+05:30
రెండో జాబితా ఎప్పుడు..?
రెండో జాబితాపై టీడీపీ, జనసేన సీనియర్, ముఖ్య నేతల్లో టెన్షన్.. టెన్షన్
తొలి జాబితాలో లేని టీడీపీ, జనసేన సీనియర్ల పేర్లు
రెండో జాబితాలో అయినా ఉంటాయా.. లేదా..? అని టెన్షన్
కీలక నియోజకవర్గాలకు దాదాపు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ
ఇంకా కొన్ని స్థానాల్లో ఖరారు కావాల్సి ఉన్న టీడీపీ, జనసేన అభ్యర్థులు
మూడు పార్లమెంట్ స్థానాలు జనసేనకు కేటాయింపు
ముగ్గురు అభ్యర్థులు ఎవరెవరు ఉంటారో అని జనసైనికుల్లో సర్వత్రా ఆసక్తి
టీడీపీ కండువా కప్పుకోకమునుపే పార్థసారథికి టికెట్ ఇచ్చిన చంద్రబాబు
రెండు మూడ్రోజుల్లో అధికారికంగా పసుపు కండువా కప్పుకోనున్న పార్థసారథి
ఎల్లుండి టీడీపీలోకి వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, పార్థసారథి
సైకిలెక్కనున్న వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి
వైసీపీ నుంచి భారీగా చేరికలు ఉంటాయని చెబుతున్న టీడీపీ వర్గాలు
ఈ చేరికల తర్వాత రెండో జాబితా ఉండే ఛాన్స్
ఈ నెలాఖరుకల్లా మిగిలిన అభ్యర్థుల ప్రకటన ఉండొచ్చంటున్న టీడీపీ పెద్దలు
ఈలోపు బీజేపీతో పొత్తుపై క్లారిటీ వచ్చే ఛాన్స్
టీడీపీ కూటమి నుంచి ప్రకటించాల్సినవి 57 స్థానాలు
ఈ 57 స్థానాల్లో బీజేపీ, టీడీపీకి మాత్రమే సీట్ల కేటాయింపుకు ఛాన్స్
-
2024-02-24T14:29:08+05:30
ధన్యవాదాలు సార్..!
ఏబీఎన్‌తో విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు
నా మీద నమ్మకంతో మరొకసారి టికెట్ కేటాయించినందుకు చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు
ప్రజలు చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నారు
విశాఖ నగరాన్ని ఆర్థిక రాజధాని గా మార్చే శక్తి ఒక్కచంద్రబాబుకే ఉంది
పశ్చిమ నియోజకవర్గం నుండి మూడుసార్లు గెలిచి..
నాలుగోసారి కూడా నా మీద నమ్మకంతో టికెట్ కేటాయించిన చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు
ఈ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపిస్తూ..
రాబోయే ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలిచి చంద్రబాబుకు సీటును కానుకగా ఇస్తాను
చంద్రబాబు సహకారంతో పశ్చిమ నియోజకవర్గ ప్రాంతాన్ని ఎన్నో రకాలుగా అభివృద్ధి చేయగలిగాను
సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపే సత్తా చంద్రబాబుకే ఉంది.. ప్రజా మద్దతుతో విజయం సాధిస్తా: గణబాబు
-
2024-02-24T14:15:34+05:30
నాగబాబు ఎమ్మెల్యేగానా.. ఎంపీగానా..?
పవన్‌తో పాటు మరో కీలక నేత నాగబాబు పోటీ స్థానంపై లేని క్లారిటీ
నాగబాబు మళ్లీ ఎంపీగా పోటీ చేస్తారా..?
లేకుంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా..?
ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎక్కడ్నుంచి..?
ఎంపీగా పోటీచేయాల్సి వస్తే గత ఎన్నికల్లో పోటీచేసిన స్థానం నుంచే ఉంటుందా..?
ఇంకా 19 స్థానాలకు అభ్యర్థులను పెండింగ్‌లో పెట్టిన జనసేన
రెండో జాబితాలో పవన్, నాగబాబు పేర్లు ఉంటాయని చెబుతున్న పార్టీ పెద్దలు
-
2024-02-24T14:00:24+05:30
బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
తానెప్పుడూ ఇంతలా అభ్యర్థుల జాబితా విషయంలో కసరత్తు చేయలేదని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పేర్కొన్నారు. టీడీపీ జాబితాను వెలువరించిన అనంతరం ఆయన మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1 కోటి 10 లక్షల మంది నుంచి అభిప్రాయ సేకరణ జరిపానన్నారు. టీడీపీ (TDP)లో ఇంత పెద్ద లిస్ట్ ఇవ్వడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. విన్నింగ్ హార్స్‌లను , పార్టీ అంటే కమిట్మెంట్ ఉన్న వాళ్లకు కొంతమందికి ఇవ్వలేకపోయారన్నారు. వారందరినీ పిలిపించి మాట్లాడుతానన్నారు. వారందరికీ పార్టీ బాధ్యతలు ప్రస్తుతం అప్పగిస్తానని చంద్రబాబు వెల్లడించారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే టికెట్ కేటాయించని అభ్యర్థులందరికీ పదవులు కూడా ఇస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తరువాత మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేశానన్నారు. కొత్త వారికి 23 మందిని అభ్యర్థులుగా ఎంపిక చేశామన్నారు. బీజేపీతో పొత్తు విషయం చర్చలు జరుగుతున్నాయన్నారు. త్వరలోనే కొలిక్కి వస్తాయన్నారు. మిగతా జాబితా కూడా త్వరలోనే ప్రకటిస్తామన్నారు. వైసీపీ ఇన్‌చార్జిలు, సమన్వయకర్తలను ప్రకటించిందన్నారు. టీడీపీ నేరుగా అభ్యర్థులను ప్రకటించిందని చంద్రబాబు అన్నారు.
-
2024-02-24T13:30:15+05:30
పవన్ ఎక్కడ్నుంచి పోటీ..?
తొలి జాబితాలో 05 మంది అభ్యర్థులను మాత్రమే ప్రకటించిన జనసేన
ఫస్ట్ లిస్ట్‌లో కనిపించని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేరు
పవన్ ఎక్కడ్నుంచి పోటీ చేస్తారని జనసేన శ్రేణుల్లో సర్వత్రా ఉత్కంఠ
భీమవరం నుంచే మళ్లీ పవన్ పోటీచేస్తారని కొన్నిరోజులుగా ప్రచారం
ఓడిన చోటే గెలిచి నిలబడాలన్నది పవన్ టార్గెట్!
రెండో జాబితాలో పవన్ పేరు ఉంటుందని చెబుతున్న పార్టీ పెద్దలు
రాయలసీమలో పోటీ చేయవచ్చని కూడా చేయవచ్చని అంటున్న జనసైనికులు
-
2024-02-24T13:00:43+05:30
తొలి జాబితాలో కనిపించని సీనియర్లు..!
99 మందితో ఉమ్మడి జాబితా ప్రకటించిన టీడీపీ- జనసేన
94 స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల ప్రకటన
05 స్థానాల్లో జనసేన అభ్యర్థుల ప్రకటన
తొలి జాబితాలో కనిపించని పలువురు టీడీపీ సీనియర్ల పేర్లు
రెండో జాబితాలో అయినా పేరు ఉంటుందా లేదా అని సీనియర్లలో టెన్షన్.. టెన్షన్
త్యాగాలకు సిద్ధంగా ఉండాలని ముందుగానే సీనియర్లు, ముఖ్యనేతలకు బాబు దిశానిర్దేశం
టీడీపీ కూటమి నుంచి ప్రకటించాల్సినవి 57 స్థానాలు
57 స్థానాల్లో బీజేపీ, టీడీపీకి మాత్రమే సీట్ల కేటాయింపుకు అవకాశం
-
2024-02-24T12:30:03+05:30
ఇదిగో ఫుల్ జాబితా..
ఇచ్ఛాపురం- బెందాళం అశోక్
టెక్కలి - కింజరాపు అచ్చన్ నాయుడు
ఆమదాలవలస - కూన రవి కుమార్
రాజం (ఎస్సీ) - కొండ్రు మురళీ మోహన్
కురుపాం (ఎస్టీ) - తొయ్యక జగదేశ్వరి
పార్వతీపురం (SC) - విజయ్ బోనెల
సాలూరు (ఎస్టీ) - గుమ్మడి సంధ్యా రాణి
బొబ్బిలి- RSVKK రంగారావు (బేబీ నయన)
గజపతినగరం - కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం - పుష్పపతి అదితి విజయలక్ష్మి గజపతిరాజు
విశాఖపట్నం తూర్పు - వెలగపూడి రామ కృష్ణబాబు
విశాఖపట్నం వెస్ట్ - PGVR నాయుడు (గన్నబాబు)
అరకు లోయ (ST) - సియ్యారి దొన్ను దొర
పాయకరావుపేట (ఎస్సీ) - వంగలపూడి అనిత
నర్సీపట్నం - చింతకాయల అయ్యన్నపాత్రుడు
తుని - యనమల దివ్య
పెద్దాపురం - నిమ్మకాయల చిన్నరాజప్ప
అనపర్తి - నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి
ముమ్మిడివరం - దాట్ల సుబ్బరాజు
గన్నవరం (ఎస్సీ) - సరిపెల్ల రాజేష్ కుమార్
కొత్తపేట - బండారు సత్యానందరావు
మండపేట - వేగుళ్ల జోగేశ్వరరావు
రాజమండ్రి సిటీ - ఆదిరెడ్డి వాసు
జగ్గంపేట - జ్యోతుల వెంకటప్పారావు (నెహ్రు )
ఆచంట - పితాని సత్యనారాయణ
పాలకొల్లు - నిమ్మల రామానాయుడు
ఉండి - మంతెన రామరాజు
తణుకు - ఆరిమిల్లి రాధా కృష్ణ
ఏలూరు - బడేటి రాధా కృష్ణ
చింతలపూడి (ఎస్సీ) - సొంగా రోషన్
తిరువూరు (ఎస్సీ) - కొలికపూడి శ్రీనివాస్
నూజివీడు - కొలుసు పార్ధసారధి
గన్నవరం - యార్లగడ్డ వెంకట్ రావు
గుడివాడ - వెనిగండ్ల రాము
పెడన - కాగిత కృష్ణ ప్రసాద్
మచిలీపట్నం - కొల్లు రవీంద్ర
పామర్రు (ఎస్సీ) - వర్ల కుమార రాజా
విజయవాడ సెంట్రల్ - బోండా ఉమ
విజయవాడ తూర్పు - గద్దె రామ్మోహనరావు
నందిగామ (ఎస్సీ) - తంగిరాల సౌమ్య
జగ్గయ్యపేట - శ్రీరాం రాజగోపాల్ తాతయ్య
తాడికొండ (ఎస్సీ) - తెనాలి శ్రావణ్ కుమార్
మంగళగిరి - నారా లోకేష్
పొన్నూరు - ధూల్లిపాళ్ల నరేంద్ర
వేమూరు (ఎస్సీ) - నక్కా ఆనంద్ బాబు
రేపల్లె - అనగాని సత్య ప్రసాద్
బాపట్ల - వేగేశన నరేంద్ర వర్మ
ప్రత్తిపాడు (ఎస్సీ) - బర్ల రామాంజనేయులు
చిలకలూరిపేట - ప్రత్తిపాటి పుల్లారావు
సత్తెనపల్లె - కన్నా లక్ష్మీనారాయణ
వినుకొండ - జివి ఆంజనేయులు
మాచర్ల - జూలకంటి బ్రహ్మానంద రెడ్డి
యర్రగొండేపాలెం (ఎస్సీ) - గూడూరి ఎరిక్షన్ బాబు
పర్చూరు - ఏలూరి సాంబశివరావు
అద్దంకి - గొట్టిపాటి రవి కుమార్
సంతనూతలపాడు (ఎస్సీ) - బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్
ఒంగోలు - దామచర్ల జనార్దనరావు
కొండెపి - డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి
కనిగిరి - ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి
కావలి - కావ్య కృష్ణా రెడ్డి
నెల్లూరు సిటీ - పి.నారాయణ
నెల్లూరు రూరల్ - కోటుంరెడ్డి శ్రీధర్ రెడ్డి
గూడూరు (ఎస్సీ) - పాసం సునీల్ కుమార్
సూళ్లూరుపేట (ఎస్సీ) - నెలవెల విజయశ్రీ
ఉదయగిరి - కాకర్ల సురేష్
కడప - మాధవి రెడ్డి
రాయచోటి - మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
పులివెండ్ల - మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి
మైదుకూరు - పుట్టా సుధాకర్ యాదవ్
ఆళ్లగడ్డ - భూమా అఖిల ప్రియారెడ్డి
శ్రీశైలం - బుద్దా రాజశేఖర్ రెడ్డి
కర్నూలు - టీజీ భరత్
పాణ్యం - గౌరు చరితారెడ్డి
నంద్యాల - Nmd. ఫరూఖ్
బనగానపల్లె - బీసీ జనార్దన్ రెడ్డి
డోన్ - కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి
పత్తికొండ - కేఈ శ్యామ్ బాబు
కోడుమూరు - బొగ్గుల దస్తగిరి
రాయదుర్గం - కాలువ శ్రీనివాసులు
ఉరవకొండ - పి.కేశవ్
తాడిపత్రి - జె. సి . అశ్మిత్ రెడ్డి
సింగనమల (SC) - బండారు శ్రావణి శ్రీ
కళ్యాణదుర్గం - అమిలినేని సురేందర్ బాబు
రాప్తాడు - పరిటాల సునీత
మడకశిర (SC) - M E సునీల్ కుమార్
హిందూపురం - నందమూరి బాలకృష్ణ
పెనుకొండ - సవిత
తంబళ్లపల్లె - జయచంద్రారెడ్డి
పీలేరు - నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి
నగరి - గాలి భాను ప్రకాష్
గంగాధర నెల్లూరు (SC) - Dr V M థామస్
చిత్తూరు - గురజాల జగన్ మోహన్
పలమనేరు - ఎన్ అమరనాథ్ రెడ్డి
కుప్పం - నారా చంద్రబాబు నాయుడు
జనసేనకు కేటాయించిన స్థానాలివే..
తెనాలి : నాదెండ్ల మనోహర్
నెల్లిమర్ల : లోకం మాధవి
అనకాపల్లి: కొణతాల రామకృష్ణ
రాజానగరం : బత్తుల బలరామకృష్ణ
కాకినాడ రూరల్: పంతం నానాజీ
-
2024-02-24T12:00:25+05:30
జనసేనకు కేటాయించిన స్థానాలివే..
తెనాలి : నాదెండ్ల మనోహర్
నెల్లిమర్ల : లోకం మాధవి
అనకాపల్లి: కొణతాల రామకృష్ణ
రాజానగరం : బత్తుల బలరామకృష్ణ
కాకినాడ రూరల్: పంతం నానాజీ
ఇతర నియోజకవర్గాల వివరాలు, అభ్యర్థుల పేర్లు 2 రోజుల్లో ప్రకటిస్తాం : పవన్ కళ్యాణ్
-
2024-02-24T11:59:03+05:30
టీడీపీ అభ్యర్థులు వీరే..
-
2024-02-24T11:55:03+05:30
టీడీపీ అభ్యర్థులు వీరే..
టెక్కలి - అచ్చెన్నాయుడు
ఇచ్ఛాపురం: బెందాళం అశోక్
రాజాం - కొండ్రు మురళీ
మంగళగిరి - నారా లోకేష్
-
2024-02-24T11:53:36+05:30
మేం పోటీ చేసే స్థానాలివే..
24 స్థానాల్లో జనసేన పోటీ
ఐదుగురు అభ్యర్థుల పేర్లు ప్రకటించిన పవన్‌కల్యాణ్
ఏపీని అభివృద్ధి పథంలో నడిపించాలి
బంగారు భవిష్యత్ కోసం.. రాష్ట్రం కోసం టీడీపీ, జనసేన కలిశాయి
బీజేపీ ఆశీస్సులు కూడా ఈ పొత్తుకు ఉన్నాయి
-
2024-02-24T11:45:52+05:30
సీట్ల లెక్కలు తేలాయ్..
తొలి జాబితాలో 99 స్థానాలు
టీడీపీ 94 స్థానాల జాబితా వెల్లడి
జనసేన 5 స్థానాలు వెల్లడి
-
2024-02-24T11:15:22+05:30
కీలక భేటీ
అభ్యర్థుల ప్రకటనకు ముందు చంద్రబాబు-పవన్ కీలక భేటీ
మరికాసేపట్లో మీడియా ముందుకు ఇరువురు నేతలు
-
2024-02-24T11:04:21+05:30
తమ్ముళ్లొచ్చేస్తున్నారు!
ఒక్కొక్కరుగా బాబు నివాసానికి చేరుకుంటున్న టీడీపీ ముఖ్యనేతలు
ఇప్పటికే చంద్రబాబు ఇంటికి వచ్చిన అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి, తంగిరాల సౌమ్య
తొలి జాబితాలో సిట్టింగులు, ఆశావహులు ఎవరెవరు ఉంటారో అని టెన్షన్!
-
2024-02-24T10:59:42+05:30
సారొచ్చారు!
జనసేన కార్యాలయం నుంచి చంద్రబాబు నివాసానికి బయలుదేరిన పవన్, నాదెండ్ల
11:30 గంటలకు మీడియా ముందుకు రానున్న చంద్రబాబు, పవన్
జనసేనకు తొలి జాబితాలో 15 సీట్లు కేటాయించే ఛాన్స్
-
2024-02-24T10:55:01+05:30
ఎంత మంది అభ్యర్థులు..?
కాగా.. తొలి జాబితాలో 65 మంది వరకు అభ్యర్థులు ఉండే అవకాశం ఉంది. వీరిలో టీడీపీ నుంచి 50-52 మంది, జనసేన నుంచి సుమారు 15 మంది ఉంటారని తెలుస్తోంది. వాస్తవానికి మెజారిటీ సీట్లకు సంబంధించి అభ్యర్థుల జాబితాలను టీడీపీ, జనసేన నాయకత్వాలు చాలా రోజుల కిందటే తయారుచేశాయి. వందకు పైగా సీట్లకు అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తిచేశాయి కూడా. ఇవాళ జాబితా రిలీజ్ చేసిన తర్వాత సీన్ మొత్తం మారిపోతుందని.. అసలు సినిమా ఇప్పుడే మొదలవుతుందని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. మరోవైపు.. 28వ తేదీన తాడేపల్లిగూడెంలో ఉమ్మడిగా భారీ బహిరంగసభకు ముందు కొందరు అభ్యర్థులను అధికారికంగా ప్రకటిస్తే ఉభయ పార్టీల శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంటుందని అంచనా వేస్తున్నారు.
-
2024-02-24T10:45:21+05:30
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో (AP Elections 2024) ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందేనని టీడీపీ-జనసేన (TDP-Janasena) పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. ఇందుకోసం ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మలుచుకుని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ముందుకెళ్తున్నారు. అధికార వైసీపీ (YSR Congress) అభ్యర్థుల ప్రకటనలో ముందు వరుసలో ఉండటంతో.. తగ్గేదేలే అంటూ తొలి జాబితాను రిలీజ్ చేయడానికి టీడీపీ, జనసేన రంగం సిద్ధం చేసుకున్నాయి. శనివారం మాఘ పౌర్ణమి మంచి రోజు కావడంతో మొదటి విడత అభ్యర్థుల పేర్లు వెల్లడించాలని మిత్రపక్షం నిర్ణయించింది. ఉదయం 11.40 నుంచి 11.47 గంటల మధ్య ముహూర్తం బాగుందని పండితులు చెప్పడంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి ఉమ్మడిగా తొలి జాబితాను రిలీజ్ చేయబోతున్నారు. దీంతో పాటు.. కొందరు లోక్‌సభ అభ్యర్థుల పేర్లు కూడా వెల్లడించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోవైపు.. ఎల్లుండి టీడీపీలోకి వైసీపీ ఎంపీ లావు, ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, పార్థసారథి రానున్నారు. వీరితో పాటు వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కూడా సైకిలెక్కనున్నారు.