Share News

YS Jagan: వైఎస్ జగన్‌తో ఉండేదెవరు.. ఊడిపోయేదెవరు.. రెండ్రోజుల్లో తేలిపోనున్న వైసీపీ భవితవ్యం..!?

ABN , Publish Date - Jun 17 , 2024 | 04:06 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) బలగమెంత..? మాజీ సీఎంతో ఎంత మంది ఉన్నారు..? ఎన్నికల ముందు.. ఫలితాల తర్వాత వైసీపీ పరిస్థితి ఎలా ఉంది..? ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్‌ ఇప్పుడు ఏం చేయబోతున్నారు..? వైసీపీ (YSR Congress) మళ్లీ పుంజుకునేది ఎప్పుడు..? అసలు అది అయ్యే పనేనా..? ఇలా ఒకటా రెండా వందల సంఖ్యలో ప్రశ్నలు వస్తున్నాయి..

YS Jagan: వైఎస్ జగన్‌తో ఉండేదెవరు.. ఊడిపోయేదెవరు.. రెండ్రోజుల్లో తేలిపోనున్న వైసీపీ భవితవ్యం..!?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) బలగమెంత..? మాజీ సీఎంతో ఎంత మంది ఉన్నారు..? ఎన్నికల ముందు.. ఫలితాల తర్వాత వైసీపీ పరిస్థితి ఎలా ఉంది..? ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్‌ ఇప్పుడు ఏం చేయబోతున్నారు..? వైసీపీ (YSR Congress) మళ్లీ పుంజుకునేది ఎప్పుడు..? అసలు అది అయ్యే పనేనా..? ఇలా ఒకటా రెండా వందల సంఖ్యలో ప్రశ్నలు వస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ విశ్లేషకులు అయితే ఊహించని రీతిలో విశ్లేషణలు చేసేస్తున్నారు. దీంతో వైసీపీ క్యాడర్ తెగ ఆందోళన చెందుతోంది. సో.. వీటన్నింటికీ, వందలాది ప్రశ్నలకు రెండంటే రెండ్రోజుల్లోనే ఫుల్ క్లారిటీ వచ్చేయనుంది. రండి ఏం జరగబోతోందో తెలుసుకుందాం..!


YS-Jagan-Meeting-02.jpg

ఏం జరగబోతోంది..?

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో (AP Election Results) ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన వైసీపీ.. ఎందుకీ పరిస్థితి వచ్చిందని పోస్టుమార్టం మొదలుపెట్టింది. ఈ క్రమంలో వరుస సమావేశాలతో తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో బిజిబిజీగా గడుపుతున్నారు. అయితే.. ఈ నెల 19న (బుధవారం) వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనుంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కూడా క్యాంప్ ఆఫీస్ వేదిక కానుంది. ఈ కీలక సమావేశానికి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలతో పాటు, ఎన్నికల్లో పోటీచేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు అందర్నీ హైకమాండ్ ఆహ్వానించింది. వీరితో పాటు ఎంపీలు మినహా పార్లమెంట్‌కు పోటీచేసిన అభ్యర్థులను కూడా ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఒక్క సమావేశంతో వైఎస్ జగన్‌తో ఉన్నదెవరు..? ఊడిపోయేదెవరు..? ఎవరెవరు ఎటు అడుగులు వేస్తారనే విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చేయనుంది. అయితే ఎవరున్నా, లేకున్నా.. జీరోతోనే వైసీపీ మొదలైందన్న విషయాన్ని వైసీపీ నేతలు కొందరు గుర్తు చేస్తూ, సోషల్ మీడియాలో చెప్పుకుంటున్న పరిస్థితి.


YS-Jagan-Meeting.jpg

ఎవరొస్తారో.. ఏంటో..?

విస్తృత స్థాయి సమావేశం అనే ప్రకటన చేసినప్పట్నుంచీ వైసీపీ హైకమాండ్‌లో ఒక్కటే టెన్షన్ మొదలైందట. సమావేశానికి ఎవరెవరు రావొచ్చు..? జగన్ తప్ప గెలిచిన 10 మందిలో ఎంత మంది రావొచ్చు..? ఎంత మంది ఇతర పార్టీల్లోకి జంప్ అవ్వొచ్చు..?.. అసలే ప్రతిపక్ష హోదా లేదు.. ఇక ఉన్న ఎమ్మెల్యేల్లో ఎవరైనా జంప్ అయితే ఏంటి పరిస్థితి..? అనేదానిపై ఒకింత గందరగోళంగానే ఉందని తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఇవాళ, రేపు గడిస్తే ఎల్లుండితో వైఎస్ జగన్ బలగమెంత..? ఎంత మంది జగన్‌తో ఉన్నారనే దానిపై ఫుల్ క్లారిటీ వచ్చేయనుందన్న మాట. వాస్తవానికి ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు టీడీపీతో, ఒకరిద్దరు ఎంపీలు బీజేపీలోకి టచ్‌లోకి వెళ్లినట్లుగా వార్తలు గుప్పుమంటున్నాయి. రెండు మూడ్రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో జంపింగ్‌లపై హడావుడి జరుగుతున్నప్పటికీ ఎక్కడా స్పందించిన దాఖలాల్లేవ్.. కనీసం ఖండించిన పరిస్థితులు కూడా లేవు. మరి మౌనానికి అర్థం అంగీకారమేనా లేదా అన్నది.. బుధవారంతో తేలిపోనుంది.. ఏం జరుగుతుందో చూడాలి మరి.

YS-Jagan.jpg

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 17 , 2024 | 04:06 PM