Share News

Viral: ఆవలిస్తే ఇలాక్కూడా జరుగుతుందా? యువతికి ఊహించని షాక్!

ABN , Publish Date - May 11 , 2024 | 03:54 PM

పెద్దగా ఆవలించిన ఓ యువతి ఊహించని చిక్కుల్లో పడింది. ఆమె కింద దవడ పక్కకు తొలగడంతో నోరూ మూయలేక ఇబ్బందుల్లో పడింది. చివరకు ఆసుపత్రిలో వైద్యులు ఆమె పరిస్థితిని చక్కదిద్దారు.

Viral: ఆవలిస్తే ఇలాక్కూడా జరుగుతుందా? యువతికి ఊహించని షాక్!
Jaw dislodged after yawning

ఇంటర్నెట్ డెస్క్: ఆవలింతలు.. వీటి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఆవలింతలు వస్తున్నాయంటే నిద్ర పోయే టైమ్ వచ్చిందని అర్థం. కానీ ఇవే ఆవలింతలు ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కొంప ముంచాయి. చివరకు ఆమె ఆసుపత్రి పాలవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.

జెన్నా సినాట్రా ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. ఆమె వయసు 21 ఏళ్లు. ఇటీవల ఆమె వీడియోలు చేసే సందర్భంలో అనుకోకుండా పెద్దగా ఆవలించింది. ఆ సమయంలో నోరు బాగా తెరవడంతో ఆమె దవడ ఎముక పక్కకు జరిగింది. దీంతో, ఆమె మళ్లీ నోరు మూయలేకపోయింది. నోరు తెరుచుకుపోవడంతో నానా అవస్థల పాలైంది (21 year old social media influencer dislocates jaw while yawning too hard).
Viral: బెడ్‌రూంలో భరించలేని దుర్గంధం! ఏం జరిగిందా అని చెక్ చేస్తే..


నోరు మూసేందుకు ఆమె ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఆమె చివరకు ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. సినాట్రా సమస్య పరిష్కరించేందుకు వైద్యులు కూడా చాలా శ్రమించారు. ఆమెకు ఎక్స్ రే, ఎమ్మఆర్ఐ వంటివి తీసి సమస్య ఎక్కడ ఉందో క్షుణ్ణంగా అర్థం చేసుకున్నారు. చివరకు దవడకు మత్తమందు ఇచ్చి సరిచేశారు.

ఇలాంటి సమస్య తలెత్తితనప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ సమస్య తలెత్తినప్పుడు వైద్యులు సాధారణంగా చేతితోనే దవడను సరి చేస్తారు. కొన్ని సందర్భాల్లో మాత్రం శస్త్రచికిత్స చేయాల్సి వస్తుంది. మత్తుమందు ఇచ్చాకే ఈ ప్రక్రియ పూర్తి చేశారు. ఆ తరువాత కూడా దవడ ఎక్కువగా కదలకుండా కట్టుకడతారు. ఆ తరువాత సమస్య నాలుగు ఐదు రోజుల్లోనే తొలగిపోతుందని చెబుతున్నారు.

Read Viral and Telugu News

Updated Date - May 11 , 2024 | 03:58 PM