Anant Ambani: అంబానీ ఇంట పెళ్లంటే ఆ మాత్రం ఉండాలి.. అనంత్ ప్రీ-వెడ్డింగ్ వేడుకలో 2,500 రకాల వంటకాలు..
ABN , Publish Date - Feb 27 , 2024 | 05:13 PM
మార్చి ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్ వేడుకలు జరగబోతున్నాయి. దాదాపు వెయ్యి మంది వ్యాపార ప్రముఖులు ఈ వేడుకల కోసం భారత్ రానున్నారు.
ప్రపంచ కుబేరులలో ఒకరైన ముఖేష్ అంబానీ (Mukesh Ambani) చిన్న కొడుకు అనంత్ అంబానీ (Anant Ambani) త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తన స్నేహితురాలు రాధికా మర్చెంట్‌ను (Radhika Merchant) వివాహం చేసుకోబోతున్నాడు. మార్చి ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు గుజరాత్‌లోని జామ్‌నగర్ (Jamnagar)లో ప్రీ-వెడ్డింగ్ వేడుకలు జరగబోతున్నాయి. దాదాపు వెయ్యి మంది వ్యాపార ప్రముఖులు ఈ వేడుకల కోసం భారత్ రానున్నారు. బిల్ గేట్స్, ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ కూడా ఈ వేడుకలకు హాజరుకాబోతున్నారట.
ఇక, ఈ వేడుకల (Pre-wedding event) కోసం అంబానీ కుటుంబం కనీ వినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తోందట. ఈ ఈవెంట్‌లో ఏర్పాటు చేయనున్న విందు భోజనం చర్చనీయాంశంగా మారింది. ఇండోర్‌కు చెందిన 65 మంది చెఫ్‌లు వంటలు సిద్ధం చేయబోతున్నారట. భారతీయ వంటకాలతో పాటు పార్సీ, థాయ్, మెక్సికన్, జపనీస్ ఫుడ్స్‌ను సిద్ధం చేస్తారట. మొత్తం మూడు రోజుల వేడుకల్లో ఏదీ రిపీట్ చేయకుండా మొత్తం 2,500 రకాల వంటకాలు వడ్డించబోతున్నారట. మూడు రోజుల్లో బ్రేక్‌ఫాస్ట్ కోసం 75 వంటకాలు, లంచ్ కోసం 225 రకాలు, రాత్రి భోజనం కోసం 275 రకాల వంటకాలు సిద్ధం చేస్తారట.
ఈ మూడు రోజుల్లో ప్రత్యేకంగా రాత్రి 12 నుంచి ఉదయం 4 గంటల వరకు మిడ్ నైట్ మీల్స్ కూడా ఉంటుందట. ఇందుకోసం 85 రకాల వంటకాలు వండుతారట. ముఖేష్ అంబానీ తల్లి కోకిలా బెన్ జామ్ నగర్‌కు చెందిన వారు. అలాగే ముఖేష్ భార్య నీతా అంబానీ తన స్వచ్ఛంద సంస్థ రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా నగర అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఈ నేపథ్యంలో జామ్ నగర్‌లోనే అనంత్ పెళ్లి చేయాలని అంబానీ కుటుంబం నిశ్చయించుకుంది.