Viral: ఇది క్రూరత్వంలో క్రియేటివిటీ.. టీవీ చూస్తున్న మూడేళ్ల పాపకు తండ్రి ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చాడంటే..
ABN , Publish Date - Jul 10 , 2024 | 11:02 AM
ప్రస్తుతం చిన్న పిల్లలను టీవీలకు, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచడం చాలా కష్టమైపోతోంది. మిగతా వాటితో పోలిస్తే తల్లిదండ్రులకు ఇదే పెద్ద సమస్యగా మారిపోయింది. పిల్లలను మొబైల్స్‌కు, టీవీలకు దూరం చేసేందుకు తల్లిదండ్రులు రకరకాల మార్గాలను ఆశ్రయిస్తుంటారు. కొందరు బుజ్జగిస్తుంటారు.
ప్రస్తుతం చిన్న పిల్లలను (Children) టీవీలకు, మొబైల్ ఫోన్లకు (Mobiles) దూరంగా ఉంచడం చాలా కష్టమైపోతోంది. మిగతా వాటితో పోలిస్తే తల్లిదండ్రులకు ఇదే పెద్ద సమస్యగా మారిపోయింది. పిల్లలను మొబైల్స్‌కు, టీవీలకు (TV) దూరం చేసేందుకు తల్లిదండ్రులు రకరకాల మార్గాలను ఆశ్రయిస్తుంటారు. కొందరు బుజ్జగిస్తుంటారు. కొందరు తిట్టి, కొట్టి భయపెడుతుంటారు. అయితే చైనా (China)కు చెందిన ఓ వ్యక్తి తన మూడేళ్ల కూతురికి పనిష్మెంట్ ఇవ్వడంలో కూడా తన క్రూరత్వాన్ని చూపించాడు. ఆ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral News).
దక్షిణ చైనాలోని గ్వాంగ్జీ జువాంగ్ ప్రాంతంలోని యులిన్ ప్రాంతానికి చెందిన మూడేళ్ల బాలిక జియాజియాకు టీవీ చూసే అలవాటు ఉంది. భోజనం కూడా చేయకుండా టీవీ చూస్తుంటుంది. ఇటీవల తండ్రి భోజనానికి పిలిచినా పట్టించుకోకుండా ఆ బాలిక టీవీ ముందు ఉండిపోయింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తండ్రి టీవీ ఆఫ్ చేశాడు. దీంతో ఆ పాప ఏడవడం ప్రారంభించింది. అప్పుడు ఆ తండ్రి తన కూతురికి ఓ గిన్నె ఇచ్చి.. కన్నీటితో ఆ గిన్నెను నింపితే టీవీ చూడనిస్తానని చెప్పాడు.
పాపం.. ఆ బాలిక టీవీ చూడాలనే ఆశతో కాసేపు ప్రయత్నించింది. అది సాధ్యం కాదని అర్థం చేసుకుని ఓటమి అంగీకరించింది. అప్పుడు ఆ బాలిక తండ్రి ఆమెను డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది చాలా క్రూరత్వం``, ``టీవీ చేసే అలవాటు మానిపించేందుకు ఇది సరైన మార్గం కాదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇది కూడా చదవండి..
Picture Puzzle: మీకు నిశిత పరిశీలనా శక్తి ఉందా? అయితే ఈ ``9``ల మధ్య ఉన్న ``6``ను కనిపెట్టండి..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..