Viral: నా ప్రోటీన్ షేక్ తాగి నా గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకెళ్లిపోయాడు.. జిమ్ రివ్యూలో ఓ భగ్న ప్రేమికుడు ఏం రాశాడంటే..
ABN , Publish Date - Dec 01 , 2024 | 09:51 PM
ప్రేమలో మోసపోయిన వ్యక్తి బాధను మరొకరు అర్థం చేసుకోలేరు. అతడు ఎంత బాధపడుతున్నాడో అతడికే అర్థమవుతుంది. అలాంటి సమయంలో ఆ వ్యక్తికి ఓదార్పు అవసరం. తన బాధను అర్థం చేసుకునే వారు ఎవరైనా ఉంటే బాగుంటుందని అలాంటి వారు కోరుకుంటారు.
ప్రేమలో (Love) మోసపోయిన వ్యక్తి బాధను మరొకరు అర్థం చేసుకోలేరు. అతడు ఎంత బాధపడుతున్నాడో అతడికే అర్థమవుతుంది. అలాంటి సమయంలో ఆ వ్యక్తికి ఓదార్పు అవసరం. తన బాధను అర్థం చేసుకునే వారు ఎవరైనా ఉంటే బాగుంటుందని అలాంటి వారు కోరుకుంటారు. అలాంటి బాధ పడుతున్న ఓ వ్యక్తి తన విషాద గాథను (Love Breakup) రివ్యూ రూపంలో రాశాడు. గూగుల్‌లో ఓ జిమ్ (Gym) గురించి రాసే ఫీడ్‌బ్యాక్ రివ్యూలో తన ప్రేమ కథను వెల్లడించాడు. ఎందుకంటే ఆ జిమ్ వల్లే అతడి ప్రేయసి (Girl Friend) బ్రేకప్ చెప్పేసిందట.
పుణె (Pune)కు చెందిన ఓ కుర్రాడు గతంలో తను వెళ్లిన జిమ్ గురించి ఫీడ్‌బ్యాక్ ఇచ్చాడు. ``కొన్ని నెలల క్రితం నా ప్రేయసితో కలిసి జిమ్‌లో జాయిన్ అయ్యాను. జిమ్ బాగుంది. సిబ్బంది కూడా మంచి వాళ్లే. కానీ, నేను ఆ జిమ్‌కు ఒక్క స్టార్ మాత్రమే ఇవ్వగలను. ఎందుకంటే నా గర్ల్‌ఫ్రెండ్ శ్రుతి అదే జిమ్‌లో ఉన్న అభిషేక్ అనే వ్యక్తితో కలిసి నన్ను మోసం చేసింది. మొదట వారిద్దరి మధ్య ఉన్నది స్నేహం మాత్రమే అనుకునేవాడిని. జిమ్‌లో నా ప్రోటీన్ షేక్‌ను అభిషేక్‌కు ఇచ్చేవాడిని. అయితే అతడు నా ప్రేయసిని నా నుంచి లాగేసుకుని నన్ను వెన్నుపోటు పొడిచాడు. ఇప్పుడు వారిద్దరూ కలిసి అదే జిమ్‌లో వర్కవుట్లు చేస్తున్నారు. నేను ఒంటరిగా మిగిలిపోయాను`` అని ఆ ప్రేమికుడు రివ్యూ రాశాడు.
ఆ వ్యక్తి విచారకర కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ కథపై సోషల్ మీడియా జనాలు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. కొందరు ఆ బాలుడిని ఎగతాళి చేయగా, మరికొందరు అతడికి సానుభూతి తెలిపారు. ``బ్రదర్, ముందుకు సాగండి, అంతా బాగానే ఉంటుంది``, ``అలాంటి వారు వదిలిపోవడమే మంచిది``, ``ఇంకెప్పుడూ జిమ్‌లో జాయిన్ అవకండి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఈమెను పెళ్లి చేసుకుంటే అప్పులన్నీ మాయం.. పెళ్లిలో వధువుకు వచ్చిన నగదు బహుమతులు చూస్తే..
Viral Video: ట్రైన్ తలుపు నుంచి వింత శబ్దాలు.. వాటిని ఆపేందుకు ఓ వ్యక్తి ఏం చేశాడో చూస్తే..
Viral Video: అచ్చం మనిషిలాగానే పరిగెడుతున్న కోతి.. వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి