Viral Video: ఆ వధువును కిడ్నాప్ చేస్తున్నారా? అత్తింటికి తీసుకెళ్తున్నారా? స్కూల్‌కెళ్లే పిల్లలా ఎలా ఏడుస్తోందో చూడండి..
ABN , Publish Date - Jun 18 , 2024 | 08:59 AM
వివాహం అనేది ప్రతిఒక్కరి జీవితంలో చాలా మార్పులకు కారణమవుతుంది. ముఖ్యంగా మన దేశంలోని ఆడ పిల్లలకు అయితే పెళ్లితో చాలా మార్పులు వస్తాయి. ఇంటి పేరు మారడమే కాదు.. అప్పటి వరకు తిరిగిన పుట్టింటిని వదలి వెళ్లిపోవాలి. ఆ సమయంలో భావోద్వేగాలు, కన్నీళ్లు సహజం.
వివాహం (Marriae) అనేది ప్రతిఒక్కరి జీవితంలో చాలా మార్పులకు కారణమవుతుంది. ముఖ్యంగా మన దేశంలోని ఆడ పిల్లలకు అయితే పెళ్లితో చాలా మార్పులు వస్తాయి. ఇంటి పేరు మారడమే కాదు.. అప్పటి వరకు తిరిగిన పుట్టింటిని వదలి వెళ్లిపోవాలి. ఆ సమయంలో భావోద్వేగాలు, కన్నీళ్లు సహజం. కానీ కొంత సేపటికి సర్దుకుని అత్తింటికి బయలుదేరక తప్పదు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఆ తర్వాత పొట్ట చెక్కలయ్యేలా నవ్వకా తప్పదు (Viral Video).
@PalsSkit అనే ట్విటర్ హ్యాండిల్లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో వివాహం తర్వాత జరిగే అప్పగింతల కార్యక్రమం జరుగుతోంది. వధువు (Bride) అత్తింటికి వెళ్లాల్సిన సమయం. ఆ సమయంలో కన్నీళ్లు పెట్టుకోవడం సహజం. అయితే ఆ వీడియోలోని వధువు అత్తింటికి (In-law`s house) వెళ్లనని మొండికేసింది. పెద్దగా కేకలు పెడుతూ ఏడుపు ప్రారంభించింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఎత్తుకుని బలవంతంగా కారులో కూర్చోబెట్టారు. ఆ సమయంలో కూడా ఆ వధువు పెద్దగా ఏడుస్తూనే ఉంది. గ్రామస్తులందరూ ఆమెను చూసి ఆశ్చర్యపోయారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు 3 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. చాలా మంది ఈ వీడియోపై ఫన్నీ కామెంట్లు చేశారు. ``ఆమెను కిడ్నాప్ చేస్తున్నారా? అత్తింటికి తీసుకెళ్తున్నారా``, ``స్కూల్‌కు వెళ్లే పిల్లలా ఉంది``, ``వెరీ ఫన్నీ``, ``ఆమెను ఎందుకు బలవంతం చేస్తున్నారు``, ``ఈ మాత్రం దానికి పెళ్లి ఎందుకు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్.. వరుసగా రోడ్డుపై పడిపోయిన బైకర్లు.. అసలేం జరిగిందంటే..
Viral Video: ఈ బ్రెయిన్‌కు అవార్డు ఇవ్వాల్సిందే.. ఏసీ వాటర్‌ను ఉపయోగించి ఏం చేస్తున్నాడో చూడండి..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..