Share News

California: అమెజాన్ రిటర్న్ ప్యాక్‌లో పిల్లి.. 6 రోజులయ్యాక బాక్స్ తెరిచి చూస్తే షాక్

ABN , Publish Date - Apr 28 , 2024 | 09:43 AM

ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే పెద్దవిగా మారుతాయి. అమెరికా దేశం కాలిఫోర్నియాలోనూ ఇలాగే జరిగింది. ఓ పెంపుడు పిల్లిని అనుకోకుండా అమెజాన్ రిటర్న్ ప్యాక్‌లో పంపింది ఓ మహిళ. దాదాపు 6 రోజులపాటు ఆ పిల్లి ఆహారం లేకుండా ప్యాక్‌లోనే ఉండిపోయింది.

California: అమెజాన్ రిటర్న్ ప్యాక్‌లో పిల్లి.. 6 రోజులయ్యాక బాక్స్ తెరిచి చూస్తే షాక్

ఇంటర్నెట్ డెస్క్: ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే పెద్దవిగా మారుతాయి. అమెరికా దేశం కాలిఫోర్నియాలో(California)నూ ఇలాగే జరిగింది. ఓ పెంపుడు పిల్లిని అనుకోకుండా అమెజాన్ రిటర్న్ ప్యాక్‌లో పంపింది ఓ మహిళ. దాదాపు 6 రోజులపాటు ఆ పిల్లి ఆహారం లేకుండా ప్యాక్‌లోనే ఉండిపోయింది.

గాలెనా అనే పిల్లిని ఉటాకు చెందిన మహిళ అమెజాన్ రిటర్న్ ప్యాక్‌లో వేసింది. ఆర్డర్‌ కాలిఫోర్నియాలోని ఓ పశువైద్యుడి దగ్గరికి చేరుకుంది. అప్పటికే తన పెంపుడి పిల్లి కనిపించట్లేదని యజమానురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పిల్లి కనిపించకపోవడంతో మానసిక ఒత్తిడికి గురైంది.


6 రోజులు గడిచాక కాలిఫోర్నియాలోని పశువైద్యుడి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. పిల్లి క్షేమంగానే ఉందని.. దానికి ఫుడ్ తినిపించినట్లు అతను యజమానురాలితో చెప్పాడు. ఆమె ఆనందంతో వెంటనే కాలిఫోర్నియాకు వెళ్లి.. పిల్లిని దగ్గరికి తీసుకుని హత్తుకుంది. అయితే ఆహారం లేకుండా ఊపిరి బిగబట్టి ఒక బాక్స్‌లో 6 రోజులపాటు పిల్లి ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని పశు వైద్యుడు అన్నాడు.

పెంపుడు జంతువులకు మైక్రోచిప్‌లు పెట్టాలని అలా అయితే అవి తప్పిపోకుండా ఉంటాయని చెప్పారు. అమెరికన్ వెటర్నరీ మెడికల్ అసోసియేషన్ ప్రకారం.. పెంపుడు జంతువులలో మూడింట ఒక వంతు వారి జీవితంలో ఏదో ఒక సమయంలో కోల్పోతాయి. అయితే మైక్రోచిప్‌లు ఉన్న జంతువులను ఈజీగా కనిపెట్టొచ్చు.

మరిన్ని వైరల్ వార్తల కోసం..

Updated Date - Apr 28 , 2024 | 09:43 AM