Share News

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ట్రైనర్‌పై ఎలుగు ఎంత కోపం పెంచుకుందో చూడండి.. అందరూ షాక్!

ABN , Publish Date - Jul 23 , 2024 | 10:43 AM

వన్య ప్రాణులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అవి ఏ క్షణంలో ఎలా ప్రవర్తిస్తాయో అంచనా వేయడం కష్టం. ఎంతో కాలం పాటు శిక్షణ ఇచ్చి సర్కస్‌లలో ఉపయోగించే జంతువులు కూడా అప్పుడప్పుడు తమ సహజ లక్షణమైన క్రూరత్వాన్ని ప్రదర్శిస్తాయి. బంధించి ఉంచడంపై ఆగ్రహం ప్రదర్శిస్తాయి.

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ట్రైనర్‌పై ఎలుగు ఎంత కోపం పెంచుకుందో చూడండి.. అందరూ షాక్!
Bear attacks trainer

వన్య ప్రాణులకు (Wild Animals) ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అవి ఏ క్షణంలో ఎలా ప్రవర్తిస్తాయో అంచనా వేయడం కష్టం. ఎంతో కాలం పాటు శిక్షణ ఇచ్చి సర్కస్‌ (Circus)లలో ఉపయోగించే జంతువులు కూడా అప్పుడప్పుడు తమ సహజ లక్షణమైన క్రూరత్వాన్ని ప్రదర్శిస్తాయి. బంధించి ఉంచడంపై ఆగ్రహం ప్రదర్శిస్తాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే షాక్ అవక తప్పదు. ఓ ఎలుగు బంటి (Bear) కొన్ని వందల మంది తన శిక్షకుడిపై దాడికి దిగింది. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).


@RestrictedVids అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో లైవ్ సర్కస్ జరుగుతోంది. ఓ ఎలుగు బంటి తన ట్రైనర్ (Trainer) చెబుతున్న పనులు చేస్తోంది. అయితే ఉన్నట్టుండి అది తీవ్ర ఆగ్రహానికి గురైంది. తనకు అజ్ఞలు ఇస్తున్న ట్రైనర్‌పై దాడికి దిగింది. అతడిని కింద పడేసి అతడిని కొరికేందుకు ప్రయత్నించింది. పక్కనే ఉన్న వ్యక్తి వెంటనే అక్కడికి వెళ్లి ఆ ఎలుగును పలుసార్లు కాలితో తన్నాడు. అయినా అది పట్టు వదల్లేదు. చుట్టూ ఉన్న వాళ్లు కేకలు వేస్తున్నా ఆ ఎలుగు బంటి తన దాడిని ఆపలేదు (Bear attacks trainer).


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 4.4 కోట్ల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. 1.4 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``వన్య ప్రాణాలకు కోపం రానీయకూడదు``, ``అవి మనుషుల మాట వినవు``, ``ఎలుగుబంట్లను మీ వినోదం కోసం వాడుకోకండి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Optical Illusion: ఈ పజిల్ స్వాల్ చేయడానికి 5 సెకెన్లు చాలు.. ఈ ``9``ల మధ్య ఉన్న ``4``ను వెతకండి..!


Microsoft Engineer: లక్షల్లో సంపాదించే మైక్రోసాఫ్ట్ ఇంజినీర్.. వారాంతంలో ఎందుకు ఆటో నడుపుతున్నాడంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 23 , 2024 | 11:49 AM