Share News

Viral News: ప్యాసింజర్లకు ఓ క్యాబ్ యజమాని వార్నింగ్ నోట్.. ఫొటో తెగ వైరల్

ABN , Publish Date - Oct 21 , 2024 | 05:58 PM

తన క్యాబ్‌లో ప్రయాణించే ప్యాసింజర్లకు పలు కండీషన్లు విధిస్తూ ఓ హైదరాబాదీ తన కారులో సీటు వెనకాల తగిలించిన ఓ వార్నింగ్ నోట్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.

Viral News: ప్యాసింజర్లకు ఓ క్యాబ్ యజమాని వార్నింగ్ నోట్.. ఫొటో తెగ వైరల్
Viral Cab Notes

తన క్యాబ్‌లో ప్రయాణించే ప్యాసింజర్లకు పలు కండీషన్లు విధిస్తూ ఓ హైదరాబాదీ తన కారులో సీటు వెనకాల తగిలించిన ఓ వార్నింగ్ నోట్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ‘‘హెచ్చరిక!!.రొమాన్స్‌ చెయ్యొద్దు. ఇదొక క్యాబ్. మీ ప్రైవేట్ స్థలమో లేక ఓయోనో కాదు. కాబట్టి దయచేసి దూరంగా ఉండండి. నిశ్శబ్దాన్ని పాటించండి’’ అని ఇంగ్లీష్‌‌లో వార్నింగ్ ఇచ్చాడు.

ఇందుకు సంబంధించిన ఫొటోను వెంకటేష్ అనే వ్యక్తి ఎక్స్‌లో షేర్ చేశాడు. ఆ పోస్టుని ‘హాయ్ హైదరాబాద్’ అనే ఎక్స్ పేజీ రీపోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో నవ్వుల పువ్వులు పూయిస్తోంది.


ఈ పోస్టుపై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. క్యాబ్ ప్రయాణీకులకు అవసరమైన సందేశమని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. ‘‘ఇలాంటి వాటిని బెంగళూరు, ఢిల్లీ నగరాల్లో చూశాను. ఇంత త్వరగా హైదరాబాద్‌లో చూస్తానని అనుకోలేదు’’ అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు.


బెంగళూరు క్యాబ్ డ్రైవర్.. ఇదే తరహా బోర్డ్

హైదరాబాద్‌లో మాదిరిగానే గత వారం బెంగళూరు నగరానికి చెందిన ఓ క్యాబ్ యజమాని పలు రూల్స్‌తో కూడిన నోట్‌ను కారులో డిస్‌ప్లే చేశాడు. డ్రైవర్ సీటు వెనుక ఉంచిన ఈ నోట్ సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఇంతకీ రూల్స్‌లో ఏమేమీ ఉన్నాయంటే.. ‘మీరు క్యాబ్ ఓనర్ కాదు’ అనేది మొదటి నిబంధనగా ఉంది.


‘‘ క్యాబ్‌ను నడుపుతున్న వ్యక్తి యజమాని. పద్దతిగా మాట్లాడి గౌరవాన్ని పుచ్చుకోండి. డోర్ నెమ్మదిగా వేయండి. మీ యూటిట్యూడ్‌ని మీ జేబులో పెట్టుకోండి. మీ యాటిట్యూడ్‌ని మాకు చూపించకండి. ఎందుకంటే మీరేం ఎక్కువ డబ్బులు ఇవ్వడం లేదు. మమ్మల్ని భయ్యా అని పిలవొద్దు. నోట్: టైమ్‌కి వెళ్లాలంటూ వేగంగా నడపమని చెప్పొద్దు’’ అని కండీషన్లు పెట్టాడు.


ఈ వార్నింగ్ నోట్‌పై నెటిజన్లు మిశ్రమ స్పందనలు వ్యక్తం చేశారు. ‘చాలా పాయింట్లు న్యాయబద్దంగా ఉన్నాయి. కానీ మమ్మల్ని భయ్యా అని పిలవవద్దనడం వెనుకాల కారణం ఏంటి?’ అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. పలువురు సరదా కామెంట్లు చేశారు. ఆ వ్యక్తి కచ్చితంగా క్యాబ్ ఓనరే అయ్యుంటాడని ఓ వ్యక్తి వ్యాఖ్యానించాడు.


ఇవి కూడా చదవండి

కుళాయిలు, షవర్ హెడ్స్ పై మురికిని నిమిషాలలో తొలగించే టిప్

మీ పిల్లలకు పొరపాటున కూడా వీటిని కొనివ్వకండి

For more Viral News and Telugu News

Updated Date - Oct 21 , 2024 | 06:19 PM