Viral Video: వార్నీ.. దీన్ని ఫ్యాన్ కటింగ్ అంటారేమో? వెరైటీగా జుత్తు ఎలా కత్తిరిస్తున్నాడో చూడండి..
ABN , Publish Date - Jun 15 , 2024 | 02:04 PM
సోషల్ మీడియాలో వైరల్‌గా మారేందుకు, ఇతరులను ఆకట్టుకునేందుకు చాలా మంది రకరకాల ట్రిక్స్ ఉపయోగిస్తున్నారు. ఇక, ఫ్యాషన్ ప్రపంచం ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటుంది. నమ్మశక్యం కాని రీతిలో రకరకాలు ప్రయోగాలు చేస్తుంటారు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారేందుకు, ఇతరులను ఆకట్టుకునేందుకు చాలా మంది రకరకాల ట్రిక్స్ ఉపయోగిస్తున్నారు. ఇక, ఫ్యాషన్ ప్రపంచం (Fashion) ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటుంది. నమ్మశక్యం కాని రీతిలో రకరకాలు ప్రయోగాలు చేస్తుంటారు. తాజాగా ఓ హెయిర్ స్టైలిస్ట్ (Hair stylist) కటింగ్ చేస్తున్న విధానం చూస్తే నవ్వాలో, ఎడవాలో తెలియని పరిస్థితి. టేబుల్ ఫ్యాన్ ముందు చట్రం ఉపయోగించి అతడు ఓ అమ్మాయికి కటింగ్ చేస్తున్నాడు (Viral Video).
chattisgarhwale అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోను ఓ సెలూన్‌లో చిత్రీకరించారు. ఓ అమ్మాయి కటింగ్ (Hair cutting) చేయించుకోవడానికి వచ్చింది. ముందుగా స్టైలిష్ట్ ఆమె జుత్తును పోనీ టెయిల్ స్టైల్‌లో పెట్టి దాన్ని టేబుల్ ఫ్యాన్ ముందు చట్రంలోకి ఎక్కించాడు. అనంతరం ఆ జుట్టును గుండ్రంగా చుట్టూ పేర్చి శ్రద్ధగా కటింగ్ చేయడం ప్రారంభించాడు. ఆ వీడియో చూసిన జనాలు విపరీతంగా నవ్వుకుంటున్నారు (Fan cutting).
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 1.4 కోట్ల మంది కంటే ఎక్కువ వీక్షించారు. 2.5 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీగా కామెంట్లు చేశారు. ``ఇలాంటి వారి వల్లే ఫ్యాన్ల రేట్లు పెరిగిపోతున్నాయి``, ``దీనిని హెలికాఫ్టర్ కట్ అంటారు``, ``మార్కెట్ల నుంచి ఫ్యాన్లు ఎక్కడకు వెళ్తున్నాయో ఇప్పుడు తెలిసింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral: సార్.. నాకు ఉద్యోగం ఉంటేనే నా లవర్ పెళ్లికి ఒప్పుకుంటుంది.. మేనేజర్‌కు వింత విన్నపం!
Viral Video: ఆ ఏనుగు తెలివికి హ్యాట్సాఫ్.. చెట్టు మీద పనస పళ్లను ఎలా తెంపిందో చూడండి.. వీడియో వైరల్!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..