Share News

Viral Video: సింహంతో ఆడుకోవాలనుకున్నాడు.. చుక్కలు చూశాడు.. షాకింగ్ వీడియో వైరల్..

ABN , Publish Date - Dec 13 , 2024 | 05:11 PM

ఇటీవలి కాలంలో వన్య ప్రాణులకు సంబంధించిన వీడియోలు ఎక్కువ మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో సింహాలు, పులులు వంటి క్రూర మృగాలతో చాలా మంది ఆటలాడుతున్నారు. ఆయా వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి జనాలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Viral Video: సింహంతో ఆడుకోవాలనుకున్నాడు.. చుక్కలు చూశాడు.. షాకింగ్ వీడియో వైరల్..
Lion video

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో చాలా వీడియోలు జనాల్ని ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వన్య ప్రాణులకు (Wild Animals) సంబంధించిన వీడియోలు ఎక్కువ మందిని ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో సింహాలు (Lion), పులులు వంటి క్రూర మృగాలతో చాలా మంది ఆటలాడుతున్నారు. ఆయా వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి జనాలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో ఒక్కోసారి ప్రమాదాల బారిన పడుతున్నారు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


mian_azhar అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. సింహం బోను (Lion Cage)లోకి ఒక వ్యక్తి ప్రవేశించి దానితో ఫొటో తీసుకోవాలనుకున్నాడు. ఆ సమయంలో ఆ సింహం తన రెండు కాళ్లతో ఒక వ్యక్తి కాలును గట్టిగా పట్టుకుంది. పక్కనే ఉన్న మరో వ్యక్తి ఓ కర్రతో ఆ సింహాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అయినా ఆ సింహం మాత్రం ఆ వ్యక్తి తన కాలును వదల్లేదు. ఆ వ్యక్తి ఆ బోను నుంచి బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. సింహం వదలకుండా మీదకు దూకుతుండడంతో ఆ వ్యక్తి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. సుదీర్ఘ ప్రయత్నం తర్వాత, చివరకు ఆ సింహం ఆ వ్యక్తిని వదిలేసింది.


సింహం బారి నుంచి తప్పించుకున్న ఆ వ్యక్తి ఊపిరి పీల్చుకుని బయటపడ్డాడు. వైరల్ అవుతున్న ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 50 లక్షల మంది వీక్షించారు. 5 లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``వ్యూస్, లైక్స్ కోసం మీ జీవితాలను ప్రమాదంలో పడేసుకోకండి``, ``వామ్మో.. ఆ వ్యక్తి ఎంత భయపడ్డాడో``, ``క్రూర మృగాలు ఎప్పుడు, ఎలా ప్రవర్తిస్తాయో చెప్పలేం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: రోడ్డు పక్కన పూలు అమ్ముకుంటున్న కుర్రాడు.. ఆ పేద బాలుడి కళ్లలో సంతోషం కోసం..


IQ Test: మీ బ్రెయిన్‌కు సవాల్.. ఈ ఫొటోలో ఉన్న తప్పు ఏంటో 5 సెకెన్లలో పట్టుకోండి..


Viral Video: వామ్మో.. పచ్చి మిరప లిప్‌స్టిక్.. బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ టిప్ చూస్తే మండిపోవడం ఖాయం..


Viral Video: ప్రమాదానికి హాయ్ చెప్పడం అంటే ఇదే.. రైలు గేటుకు వేలాడుతూ రీల్.. చివరకు ఆమె ఏమైందంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 13 , 2024 | 05:11 PM