Share News

Viral Video: గుక్క పెట్టి ఏడుస్తున్న కూతురిని మంటల మధ్య వదిలేసి భార్యపై ప్రేమ.. నెటిజన్లు ఫైర్!

ABN , Publish Date - Jun 24 , 2024 | 02:26 PM

ఓ కార్యక్రమంలో భార్యాభర్తలు తమ చిన్నారి కూతురి పట్ల ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో ఆగ్రహానికి గురవుతోంది. కంటెంట్ క్రియేటర్ ప్యారీ సోనీ అనే మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పార్టీకి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోను చూసిన చాలా మంది సోనీని, ఆమె భర్తను ట్రోలింగ్ చేస్తున్నారు.

Viral Video: గుక్క పెట్టి ఏడుస్తున్న కూతురిని మంటల మధ్య వదిలేసి భార్యపై ప్రేమ.. నెటిజన్లు ఫైర్!
party

ఓ కార్యక్రమంలో భార్యాభర్తలు తమ చిన్నారి కూతురి (Girl) పట్ల ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో ఆగ్రహానికి గురవుతోంది. కంటెంట్ క్రియేటర్ ప్యారీ సోనీ అనే మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పార్టీ (Party)కి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోను చూసిన చాలా మంది సోనీని, ఆమె భర్తను ట్రోలింగ్ చేస్తున్నారు. చిన్న పాప పట్ల అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారంటూ కామెంట్లు చేస్తున్నారు. p_soni_0510 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (Viral Video).


వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ పార్టీ చాలా వైభవంగా జరుగుతోంది. సోనీ, ఆమె భర్త తమ కూతురు ఉన్న ట్రాలీని తోసుకుంటూ వేదిక మీదకు వచ్చారు. వెంటనే టపాసులను (Fire Crackers) పేల్చారు. ఆ శబ్దాలకు, మంటలకు ఆ చిన్న పాప భయపడి ఏడుపు మొదలుపెట్టింది. అయినా ఆ తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఫోటోలకు ఫోజులిచ్చారు. అంతలో ఓ టపాసు పేలి మంటలు సోనీ పైకి వచ్చాయి. దీంతో సోనీ గాయపడింది. భార్య గాయపడినట్టు తెలుసుకున్న భర్త ఆమెను హత్తుకుని ఉండిపోయాడు.


గుక్కపట్టి ఏడుస్తున్న చిన్న పాపను ఎవరూ పట్టించుకోలేదు. ఇంతలో పక్క నుంచి ఓ మహిళ వచ్చి ఆ పాపను పట్టుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్షల్లో వ్యూస్ వచ్చాయి. దాదాపు 30 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``బాధ్యత లేని తల్లిదండ్రులు``, ``పాపను పట్టించుకోవడం మానేసి భార్యను పట్టుకున్నాడేంటి``, ``ఇది చాలా నిర్లక్ష్యాపూరిత చర్య`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: వేసవి ఎండకు చెక్ పెట్టాల్సింది ఇలాగే మరి.. ఓ వ్యక్తి వినూత్న ఆలోచనపై నెటిజన్ల కామెంట్లు!


Puzzle: ఈ ఫొటోలో తప్పేంటో 8 సెకెన్లలో కనిపెడితే మీ బ్రెయిన్ పవర్ ఫుల్ అని నమ్మొచ్చు..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 24 , 2024 | 02:26 PM