Share News

Viral Video: పాపం.. హీరోలా దూసుకుపోదాం అనుకున్నాడు.. చివరకు రెండు బస్సులు మధ్య ఇరుక్కున్నాడు..

ABN , Publish Date - Sep 17 , 2024 | 04:38 PM

రోడ్లపై వెళ్లేటపుడు చాలా మంది అనవసరమైన ఆత్రుత ప్రదర్శిస్తారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించి అడ్డదారుల్లో వేగంగా వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో వారు ప్రమాదాలకు గురి కావడమే కాకుండా, ఇతరులను కూడా ఇబ్బంది పెడుతుంటారు. అలా షార్ట్ కట్స్‌లో వెళ్లడం కొద్ది మంది థ్రిల్ కోసం చేస్తుంటారు.

Viral Video: పాపం.. హీరోలా దూసుకుపోదాం అనుకున్నాడు.. చివరకు రెండు బస్సులు మధ్య ఇరుక్కున్నాడు..
BIker stuck between busses

రోడ్లపై వెళ్లేటపుడు చాలా మంది అనవసరమైన ఆత్రుత ప్రదర్శిస్తారు. ట్రాఫిక్ నియమాలను (Traffic Rules) ఉల్లంఘించి అడ్డదారుల్లో వేగంగా వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో వారు ప్రమాదాలకు గురి కావడమే కాకుండా, ఇతరులను కూడా ఇబ్బంది పెడుతుంటారు. అలా షార్ట్ కట్స్‌లో వెళ్లడం కొద్ది మంది థ్రిల్ కోసం చేస్తుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి హీరోలా బైక్ స్టంట్స్ (Bike stunt) చేద్దామనుకున్నాడు. ఆగి ఉన్న రెండు బస్సుల మధ్య నుంచి దూసుకెళ్లిపోదాం అనుకున్నాడు. అయితే చివరకు ఆ రెండింటి మధ్య ఇరుక్కుపోయి నానా కష్టాలు పడ్డాడు (Viral Video).


@DriveSmart_IN అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. సిగ్నల్ పడడంతో రెండు బస్సులు రోడ్డ మీద పక్క పక్కనే ఆగి ఉన్నాయి. ఆ రెండింటి మధ్య చిన్న గ్యాప్ మాత్రమే ఉంది. ఓ బైకర్ ఆ గ్యాప్‌లో నుంచి దూసుకెళ్లిపోదాం అనుకున్నాడు. అయితే మధ్యలోకి వెళ్లి ఆ రెండింటి మధ్య ఇరుక్కుపోయాడు. వెనక్కి వెళ్లడానికి, ముందుకు వెళ్లడానికి లేకుండా మధ్యలోనే ఆగిపోయాడు. అయినా పట్టు వదలకుండా బైక్‌ను బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. చివరకు బస్సు డ్రైవర్ మెల్లిగా బస్సును ముందుకు నడపడంతో ఆ బైకర్ సురక్షితంగా బయటపడ్డాడు. బస్సులోని వారు ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 8.3 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 1.7 వేల కంటే ఎక్కువ మంది లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``ఈ వ్యక్తి తన జీవితం గురించి అస్సలు పట్టించుకోడు``, ``అతడని చెంపదెబ్బ కొట్టాలి``, ``బైకర్లు ఎక్కువగా ఇతరుల నుంచే భద్రత ఆశిస్తారు``, ``ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ధైర్యవంతులైతేనే ఈ వీడియో చూడండి.. ట్రాక్టర్ చక్రం లేపుదామనుకున్నాడు.. కాళ్లు పోగొట్టుకున్నాడు..


Optical Illusion: మీ దృష్టి ఎంత షార్ప్‌గా ఉంది?.. ఈ ఫొటోలో భిన్నంగా ఉన్న గొడుగును కనిపెట్టండి..


Viral Video: వార్నీ.. ఈ బుడతడు భలే ధైర్యవంతుడు.. బల్లిని పట్టుకుని ఎలా ఆడుతున్నాడో చూడండి..


Viral: ఏడాదికి రూ.30 లక్షల జీతం ఉండాలి.. పేరెంట్స్ ఉండకూడదు.. ఓ వధువు పెట్టిన కండిషన్లు వింటే కళ్లు తేలెయ్యాల్సిందే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 17 , 2024 | 04:38 PM