Viral Video: ఆఫీస్‌కు లేట్ అయిన ఉద్యోగి.. అతడు సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో చూస్తే షాక్ అవడం ఖాయం!
ABN , Publish Date - Apr 03 , 2024 | 02:18 PM
టెక్నాలజీ మన జీవితాన్ని సులభతరం చేసింది అనుకుంటుంటాం. కానీ, కొన్నిసార్లు అది మనకు ఒక్కోసారి విచిత్రమైన సమస్యలను కూడా సృష్టిస్తుంది.
టెక్నాలజీ (Technology) మన జీవితాన్ని సులభతరం చేసింది అనుకుంటుంటాం. కానీ, కొన్నిసార్లు అది మనకు ఒక్కోసారి విచిత్రమైన సమస్యలను కూడా సృష్టిస్తుంది. అలాంటి ఘటనకు సంబంధించిన ఓ సరదా ఉదాహరణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నోయిడాకు (Greater Noida) చెందిన ఓ వ్యక్తి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.
నోయిడాకు చెందిన ప్రతీక్ అనే వ్యక్తి ప్రతిరోజూ తన ఈవీ స్కూటర్‌పై (EV Scooter) ఆఫీసుకు వెళ్లి వస్తుంటాడు. మంగళవారం అతడు ఆఫీసుకు చేరుకోవడం ఆలస్యం అయింది (Late to office). దానికి కారణం అతడి ఈవీ స్కూటర్. ఆథెర్ కంపెనీకి చెందిన ఆ స్కూటర్ ప్రతీక్ ఎక్కిన సమమంలో అప్‌డేట్ (Update) అవుతోంది. ఫలితంగా ఆ స్కూటర్ ముందుకు కదల్లేదు. అది అప్‌డేట్ అయ్యేవరకు ప్రతీక్ వేచి ఉండాల్సి వచ్చింది. తన స్కూటర్ అప్‌డేట్ అవుతున్నందున ఆఫీసుకు ఆలస్యంగా వచ్చినట్టు పేర్కొంటూ అతను తన బాస్‌కి సంజాయిషీ ఇచ్చుకున్నాడు.
ఆ వీడియోను తన ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 4.5 లక్షల మందికి పైగా వీక్షించారు. 5.3 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు. ``కొత్త సాకు దొరికింది``, ``కొన్ని కంపెనీల స్కూటర్లు ఇన్‌స్టాల్ కోసం పర్మిషన్ అడుగుతాయి``, ``భవిష్యత్తులో ఇది సాధారణ కారణంగా మారిపోతుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.