Viral Video: రైల్లో అమ్ముతున్న వస్తువులను కొంటున్నారా? ఇతనికి ఎదురైన అనుభవం గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే..!
ABN , Publish Date - Jun 24 , 2024 | 04:38 PM
రైలు ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఆహార పదార్థాలను, రకరకాల వస్తువులను అమ్మేవారిని చూస్తుంటాం. సాధారణంగా రైళ్లలో అమ్మే ఆహార పదార్థాలు చాలా నాసిరకంగా ఉంటాయనే సంగతి అందరికీ తెలిసిందే. ఆహార పదార్థాల సంగతి పక్కన పెడితే జర్నీలో అవసరమయ్యే టూత్ బ్రష్, పేస్ట్, చైన్లు వంటివి కొందరు అమ్ముతుంటారు
రైలు (Train) ప్రయాణాలు చేస్తున్నప్పుడు విక్రేతలు ఆహార పదార్థాలను, రకరకాల వస్తువులను విక్రయిస్తుంటారు. సాధారణంగా రైళ్లలో అమ్మే ఆహార పదార్థాలు (Food in Train) చాలా నాసిరకంగా ఉంటాయనే సంగతి అందరికీ తెలిసిందే. ఆహార పదార్థాల సంగతి పక్కన పెడితే జర్నీలో అవసరమయ్యే టూత్ బ్రష్, పేస్ట్, చైన్లు వంటివి కొందరు అమ్ముతుంటారు. సెల్‌ఫోన్ ఛార్జింగ్‌కు అవసరమయ్యే పవర్ బ్యాంక్‌ల (Power Bank)ను కూడా ఇటీవలి కాలంలో రైళ్లలో అమ్ముతున్నారు. అయితే రైళ్లలో అమ్మే ఎలక్ట్రానిక్ డివైజ్‌లను కొంటే ఎంతలా మోసపోతామో ఓ వీడియో కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది (Viral Video).
im_biru_yadav అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి రైలులో ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో ఓ వ్యక్తి పవర్ బ్యాంక్‌లు అమ్ముతూ అక్కడకు వచ్చాడు. తన దగ్గర ఉన్న పవర్ బ్యాంక్‌ల గురించి వివరించాడు. పూర్తి గ్యారెంట్ ఉందని, పాడైతే తిరిగి ఇవ్వవచ్చని చెప్పాడు. వినియోగదారుడు సామ్‌సంగ్ పవర్ బ్యాంక్‌ను తీసుకుని దాని నాణ్యతను పరిశీలించాడు. పవర్ బ్యాంక్‌ను ఓపెన్ చేయగా లోపల మట్టి కనిపించడంతో షాకయ్యాడు. విక్రేత భయపడి వీడియో రికార్డింగ్ ఆపాలని డిమాండ్ చేశాడు. వినియోగదారుడి చేతిలోని పవర్ బ్యాంక్‌లన్నింటినీ తీసేసుకున్నాడు.
ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 21 లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. 2.8 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది డిజిటల్ ఇండియా``, ``అతడి కాన్ఫిడెన్స్ చూడండి``, ``రైళ్లలో ఏమైనా కొంటే నష్టం తప్పదు``, ``రైల్వే శాఖ ఎప్పటికీ ఇలాంటి వాళ్లను నియంత్రించలేదు``, ``రూ.300కు వచ్చే ఒరిజినల్ సామ్‌సంగ్ పవర్ బ్యాంక్ ఇలాగే ఉంటుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Puzzle: ఈ ఫొటోలో తప్పేంటో 8 సెకెన్లలో కనిపెడితే మీ బ్రెయిన్ పవర్ ఫుల్ అని నమ్మొచ్చు..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..