Viral Video: వావ్.. సాటి మనిషికి కష్టం వస్తే ఇలా కాపాడాలి? రైలు కింద పడిని వ్యక్తిని ప్రయాణికులు ఎలా కాపాడారో చూడండి..
ABN , Publish Date - Jun 10 , 2024 | 12:32 PM
ఇటీవలి కాలంలో రైలు ప్రమాదాలు ఎక్కువైపోయాయి. ముఖ్యంగా రైల్వే స్టేషన్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాలు కోల్పోవడమో, తీవ్ర గాయాల పాలవడమో జరుగుతోంది. అలాంటి సందర్భాల్లో వేరేవారు తక్షణమే స్పందించినా రక్షించడం కష్టం అవుతుంది.
ఇటీవలి కాలంలో రైలు ప్రమాదాలు (Train Accidents) ఎక్కువైపోయాయి. ముఖ్యంగా రైల్వే స్టేషన్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాలు కోల్పోవడమో, తీవ్ర గాయాల పాలవడమో జరుగుతోంది. అలాంటి సందర్భాల్లో వేరేవారు తక్షణమే స్పందించినా రక్షించడం కష్టం అవుతుంది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video)లో ప్రయాణికులందరూ కలిసి ఓ వ్యక్తిని కాపాడారు. ఏకంగా రైలు భోగీనే కాస్త పక్కకు జరిపారు. ఆస్ట్రేలియా (Australia)లోని పెర్త్‌లో ఈ ఘటన జరిగింది.
sachkadwahai అన్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ రైలు స్టేషన్‌లో ఆగి ఉంది. లోపలి నుంచి ఓ ప్రయాణికుడు కిందకు దిగుతున్నాడు. అయితే చూసుకోకపోవడంతో అతడి కాలు స్టేషన్ ప్లాట్‌ఫామ్, రైలు మధ్య ఇరుక్కుపోయింది. ఆ వ్యక్తి తన కాలును తీసివేయడానికి తన వంతు ప్రయత్నం చేశాడు. కానీ, కుదరలేదు. అతడి పరిస్థితిని గమనించిన ఓ వ్యక్తి సహాయం కోసం అక్కడ ఉన్న వారిని పిలిచాడు. క్షణాల్లో అందరూ గుమిగూడి ఆ రైలు భోగీని కాస్త పైకి తోశారు. దీంతో ఆ వ్యక్తి తన కాలును బయటకు తీసేశాడు.
ఈ ఘటన స్టేషన్‌లో అమర్చిన సీసీటీవీ కెమేరాలో రికార్డు అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ``మనమందరం దీని కోసమే జీవిస్తున్నాము. ప్రేమ, గౌరవం``, ``ఇలాంటి మనుషుల మధ్య జీవితం చాలా అందంగా ఉంటుంది``, ``అక్కడ ఉన్న వారెవరూ తమ మొబైల్ తీసి వీడియోలు తీసేందుకు ప్రయత్నించలేదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion: మీవి నిజంగా డేగ కళ్లు అయితే.. ఈ ఫొటోలో ఉన్న నెంబర్‌ను కనిపెట్టండి..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..