Viral: వార్నీ.. ఇలా కూడా రాసుకుంటారా.. కారుకు అంటించిన స్టిక్కర్ చూస్తే మతి పోవాల్సిందే..
ABN , Publish Date - Nov 19 , 2024 | 09:25 AM
విచిత్ర ఘటనలు ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మందిని చేరుతున్నాయి. కొందరు వింత పనులు చేస్తూ, రీల్స్‌ను తయారు చేసి వైరల్ అవుతుంటారు. కొన్ని ఫొటోల్లో మీరు ఇంతకు ముందెన్నడూ ఊహించనిది కనిపిస్తుంటుంది. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ విశాల ప్రపంచంలో కొన్ని కోట్ల మంది జీవిస్తున్నారు. వారిలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఆలోచిస్తూ ఉంటారు. వింత వింతగా ఆలోచించి చుట్టు పక్కల వారికి షాకిస్తుంటారు. అలాంటి విచిత్ర ఘటనలు ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చాలా మందిని చేరుతున్నాయి. కొందరు వింత పనులు చేస్తూ, రీల్స్ (Reels)ను తయారు చేసి వైరల్ అవుతుంటారు. కొన్ని ఫొటోల్లో మీరు ఇంతకు ముందెన్నడూ ఊహించనిది కనిపిస్తుంటుంది. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటో చూసిన వారు నవ్వుకుంటున్నారు (Funny Post).
ghantaa అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ ఫొటో షేర్ అయింది. సాధారణంగా చాలా మంది తమ బైక్‌లకు, కార్లకు పలు స్టిక్కర్లు అంటిస్తుంటారు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పోలీసులు (Police) ఆపకుండా ఉండేందుకు తమ వృత్తి ఆధారంగా పోలీస్ అనో, ప్రెస్ అనో, ఆర్మీ అనో, ఎమ్మెల్యే, ఎంపీ తాలుకా అనో స్టిక్కర్లు వేస్తుంటారు. వాటిని చూసి పోలీసులు ఒక్కోసారి వదిలేస్తుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫొటోలో ఓ వ్యక్తి విచిత్రమైన స్టిక్కర్ వేశాడు. తన కారు ముందు భాగంలో ``ఫ్రెండ్ ఆఫ్ పోలీస్`` అని స్టిక్కర్ పెట్టాడు. రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తి ఆ కారును ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ ఫొటో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ... ``బాస్ అంగీకరించాడు`` అని క్యాప్షన్ ఇచ్చారు.
ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోకు దాదాపు పది లక్షల వ్యూస్ వచ్చాయి. 1.4 లక్షల కంటే ఎక్కువ మంది ఈ ఫొటోను లైక్ చేశారు. ఈ ఫొటోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``నేను పోలీసలు స్నేహితుడికి స్నేహితుడిని``, ```ఇది ఫ్రెండ్లీ పోలీసింగ్``, ``ఇది కచ్చితంగా ఢిల్లీకి సంబంధించినదే అయి ఉంటుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion Test: మీ కళ్లకు సవాల్.. ఈ అడవిలో కప్ప ఎక్కడుందో 10 సెకెన్లలో కనుక్కోండి..
Viral Video: మీరూ ఇలాంటి తప్పు చేయకండి.. ఆ కార్ డ్రైవర్ చేసిన పనికి ఏకంగా రూ.2.5 లక్షల జరిమానా..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి