Share News

తండ్రికి తగ్గ తనయ..

ABN , Publish Date - Dec 15 , 2024 | 08:53 AM

క్రికెట్‌లో సచిన్‌కు ఎంత క్రేజ్‌ ఉందో.. సామాజిక మాధ్యమాల్లో సారాటెండుల్కర్‌కు అంత పాలోయింగ్‌ ఉంది. ఇప్పుడామె తండ్రి ఏర్పాటు చేసిన ఫౌండేషన్‌కు డైరెక్టర్‌గా కొత్త బాధ్యతలు స్వీకరించింది..

తండ్రికి తగ్గ తనయ..

క్రికెట్‌లో సచిన్‌కు ఎంత క్రేజ్‌ ఉందో.. సామాజిక మాధ్యమాల్లో సారాటెండుల్కర్‌కు అంత పాలోయింగ్‌ ఉంది. ఇప్పుడామె తండ్రి ఏర్పాటు చేసిన ఫౌండేషన్‌కు డైరెక్టర్‌గా కొత్త బాధ్యతలు స్వీకరించింది..

క్రికెట్‌ మైదానంలో ఉన్నప్పుడు సచిన్‌ టెండుల్కర్‌కు ఎంత స్పష్టమైన లక్ష్యం ఉంటుందో.. భవిష్యత్తు పట్ల కూడా అంతే కచ్చితమైన విజన్‌ ఉంటుంది. ఆయన చిన్న వయసులోనే రికార్డులన్నీ బద్దలుకొట్టి.. అందరికంటే ముందే క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయ్యారు. అయినా సరే ఖాళీగా కూర్చోలేదు. సమాజం తనకెంతో ఇచ్చింది.. తను కూడా తిరిగి ఇవ్వాలనే దృక్పథం ఆయనది.


అందుకే ‘సచిన్‌ టెండుల్కర్‌ ఫౌండేషన్‌’ను ఏర్పాటు చేశారు. ‘‘నా చుట్టూ ఎంతో మందిఆత్మీయులు, కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్లందరూ నా మీద చూపే ప్రేమ వెలకట్టలేనిది. నేను క్రికెట్‌లో ప్రపంచకప్‌ గెలిస్తే చాలు అనుకున్నాను. నా కల ఫలించింది. ఇంకేం కావాలి? ఇక, సమాజంలోని అసమానతల్ని తగ్గించేందుకు ప్రయత్నం చేయాలి అనుకున్నాను. ముఖ్యంగా బాలల సంక్షేమానికి నా వంతు కృషి చేయాలన్నది నా అభిమతం. ఎంతోమంది పిల్లలకు సమాన హక్కులు లభించడం లేదు. విద్య, వైద్యం, క్రీడలు, ఆహారం.. ఇలా అన్నీ అందరికీ లభించడం లేదు. ఆ కొరతను మా ఫౌండేషన్‌తీరుస్తుంది’’ అన్నారాయన.

book5.3.jpg


సచిన్‌ ఏది చేసినా ముందు చూపుతో చేస్తారనేందుకు.. ఆయన కూతురు సారా టెండుల్కర్‌ అందుకు నిదర్శనం. పేదపిల్లల సంక్షేమానికి ఆమె కృషి చేసేలా.. ముందుగానే సారాతో క్లినికల్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌ న్యూట్రిషన్‌ కోర్సులు చేయించారు. సారాకు కూడా ఆ సబ్జెక్టులంటే ఇష్టం. ఆమె లండన్‌ విశ్వ విద్యాలయంలో చదువుకుంది. యూనివర్శిటీలో ఉన్నప్పటి నుంచీ సేవా కార్యక్రమాలు చేసేది. స్నేహితులతో బృందాలుగా ఏర్పడి స్వచ్ఛందసంస్థలతో కలిసి పనిచేయడం విశేషం.


అలా తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ.. పలు చైతన్య కార్యక్రమాల్లో పాల్గొంటోందిలా. స్కిన్‌కేర్‌, ఫిట్‌నెస్‌, వెల్‌నెస్‌ వంటి అంశాలలో ఆమెకు ఆసక్తులు ఎక్కువ. తను సామాజిక మాధ్యమాల్లో ఇన్‌ఫ్లుయెన్సర్‌ కూడా. అవకాశం వచ్చినప్పుడల్లా సచిన్‌ ఫౌండేషన్‌లో పాల్గొంటూ పలు కార్యక్రమాలను చేస్తోంది. ఈ స్వచ్ఛంద సంస్థ పలు ఆస్పత్రులతో ఒప్పందాలు పెట్టుకుని నిరుపేద పిల్లలకు వైద్య సహాయం అందిస్తోంది.

book5.2.jpg


యునిసెఫ్‌ లాంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి పేద విద్యార్థులకు బల్లలు, కంప్యూటర్లు, పరికరాలు, పుస్తకాలను సరఫరా చేస్తోంది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని విద్యార్థులకు క్రీడల్లో తర్ఫీదునిస్తూ ప్రోత్సహిస్తోంది. ఇప్పుడు సచిన్‌ఫౌండేషన్‌కు సారాటెండుల్కర్‌ డైరెక్టర్‌గా ఎంపికవ్వడంతో.. ఆమెపై మరిన్ని బాధ్యతలు పెరిగాయి. స్వతహా ఆమె పౌష్టికాహార నిపుణురాలు కావడం, సామాజిక మాధ్యమ ప్రభావశీలుర జాబితాలో ఉండటం వల్ల.. సేవాకార్యక్రమాలు మరింత సులభతరం అవుతాయని సచిన్‌ పేర్కొంటున్నారు. ఇప్పుడు సారాను అందరూ అభినందనలతో ముంచెత్తుతున్నారు.

Updated Date - Dec 15 , 2024 | 08:53 AM