Share News

Viral News: గర్ల్‌ఫ్రెండ్ కొత్త హెయిర్‌ స్టెయిల్ నచ్చలేదని.. నమ్మలేని పని చేశాడు

ABN , Publish Date - Nov 08 , 2024 | 07:12 AM

ఓ వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్‌ను కనికరం లేకుండా కత్తితో పొడిచి చంపాడు. దారుణమైన ఈ హత్యకు కారణం తెలిస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. కొత్త హెయిల్ స్టైయిల్ నచ్చలేదనే ఏకైక కారణంతో గర్ల్‌ఫ్రెండ్‌ను అంతమొందించాడు. అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఈ షాకింగ్ ఘటన జరిగింది.

Viral News: గర్ల్‌ఫ్రెండ్ కొత్త హెయిర్‌ స్టెయిల్ నచ్చలేదని.. నమ్మలేని పని చేశాడు

ఓ వ్యక్తి కనికరం లేకుండా కత్తితో పొడిచి పొడిచి తన గర్ల్‌ఫ్రెండ్‌ను చంపాడు. దారుణమైన ఈ హత్యకు కారణం తెలిస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. కొత్త హెయిల్ స్టైయిల్ నచ్చలేదనే ఏకైక కారణంతో గొడవ పడి ప్రాణాలు తీశాడు. అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఈ షాకింగ్ ఘటన జరిగింది.

నిందితుడి పేరు బెంజమిన్ గువల్ (49) తన 50 ఏళ్ల గర్ల్‌ఫ్రెండ్ మార్టినెజ్-సిల్వాను హత్య చేశాడు. కొత్త హెయిల్ స్టైయిల్‌లో భాగంగా ఆమె జుట్టు కత్తిరించుకుందనే కోపంతో ఈ నేరానికి పాల్పడ్డాడని మృతురాలి కూతురు వెల్లడించింది. హెయిర్‌కట్‌ విషయంలో గతంలో కూడా ఇద్దరి మధ్య ఘర్షణలు జరిగాయని, కత్తితో పొడిచి చంపేస్తానని బెంజమిన్ బెదిరించాడని కూతురు వెల్లడించింది.


హెయిల్ స్టైయిల్ విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో మార్టినెజ్-సిల్వా తన ఇంటికి వచ్చిందని, రాత్రిపూట ఇక్కడే ఉందని కూతురు తెలిపింది. తెల్లారిన తర్వాత మార్టినెజ్-సిల్వా తన తమ్ముడి ఇంటికి వెళ్లిందని, బెంజమిన్‌తో విడిపోయానని ఆమె చెప్పినట్టు పేర్కొంది. అయితే మార్టినెజ్-సిల్వాను వెతుక్కుంటూ బెంజమిన్ అక్కడికి వెళ్లాడు. అక్కడికి రాలేదని వారు చెప్పడంతో కొన్ని నిమిషాల తర్వాత అక్కడి నుంచి వెనక్కి తిరిగినట్టే కత్తి తీసుకొని వచ్చి గర్ల్‌ఫ్రెండ్ సోదరుడిపై దాడికి పాల్పడినట్టు కోర్టు పత్రాల ద్వారా వెల్లడైంది.


కాగా మార్టినెజ్-సిల్వా ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఆమె సోదరుడు కత్తిపోట్లకు గురవ్వడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కాగా రోడ్డు వెళుతున్న ఇద్దరు వ్యక్తులు నిందితుడి దాడిని ఆపేందుకు ప్రయత్నాంచారు. కానీ వారిపైకి కూడా దాడికి యత్నించాడు. కానీ అదృష్టవశాత్తూ వాళ్లు తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న సమయానికి నిందితుడు బెంజమిన్ అక్కడే ఉన్నాడు. కారులో కూర్చొని చేతిలో కత్తితో ఉన్నాడు. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ప్రస్తుతం బెంజమిన్ లాంకాస్టర్ కౌంటీ జైలులో ఉన్నాడని, చట్టపరంగా తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు. కాగా మార్టినెజ్-సిల్వా అంత్యక్రియల నిర్వహణకు అవసరమైన డబ్బు సేకరణ మొదలుపెట్టారు. ‘గోఫండ్‌మీ’ పేజీ ద్వారా నిధులు సేకరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మాకు ఎప్పుడూ రాలేదని, తీవ్రమైన కష్టాల్లో ఉన్నామని వారు పేర్కొన్నారు.

Updated Date - Nov 08 , 2024 | 07:16 AM