Share News

Viral: ఈ బీటెక్ విద్యార్థి చేసిన తప్పు ఎవరూ చేయొద్దు!

ABN , Publish Date - Jun 25 , 2024 | 08:20 PM

సరైన అవగాహన లేకుండా ట్రేడింగ్‌లోకి దిగితే ఎంత ప్రమాదమో చెబుతూ ఓ సీఏ నెట్టింట పంచుకున్న ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

Viral: ఈ బీటెక్ విద్యార్థి చేసిన తప్పు ఎవరూ చేయొద్దు!

ఇంటర్నెట్ డెస్క్: స్టాక్‌మార్కెట్ ట్రేడింగ్.. భారీ లాభాల పేరిట ఎన్నో ప్రకటనలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతుంటాయి. క్షణాల్లో భారీగా కూడబెట్టొచ్చన్న ఆశలు రేకెత్తిస్తుంటాయి. అదెంత ప్రమాదమో తెలిపే ఘటనను తాజాగా చార్టెడ్ అకౌంట్ వెల్లడించాడు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్‌కు బానిసైన ఓ బీటెక్ విద్యార్థి ఏకంగా రూ.46 లక్షలు నష్టపోయాడని తెలిపాడు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌‌‌గా (Viral) మారింది. జనాలు షాకయ్యేలా చేస్తోంది.

Viral: ఏ భార్యా చూడలేని దృశ్యం.. కళ్ల ముందే ఆమె భర్తను..

బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న సదరు విద్యార్థి ఐటీఆర్ తానే ఫైల్ చేశానని సదరు సీఏ చెప్పుకొచ్చాడు. ఈసారి ఏడాది అతడి సంపాదన ఏమీ లేకపోయినా నష్టాలు మాత్రం రూ.26 లక్షలకు చేరాయని చెప్పాడు. గతేడాది కూడా అతడు దాదాపుగా రూ.20 లక్షలను ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్‌లో పోగొట్టుకున్నాడని వివరించాడు (Addicted To F&O Trading Engineering Student Loses Rs 46 Lakh In Stock Marke).


ట్రేడింగ్‌కు బానిసైన విద్యార్థి నష్టాలు వచ్చినా ట్రేడింగ్‌ మానలేకపోయాడని ఆ సీఏ చెప్పుకొచ్చాడు. అతడి తల్లిదండ్రులకు కూడా ఈ నష్టాల గురించి తెలియదన్నాడు. బ్యాంకుల నుంచి వ్యక్తిగత లోన్లు, ఫ్రెండ్స్ నుంచి అప్పులు, చివరకు తల్లిదండ్రుల అకౌంట్ల నుంచి వారికి తెలీకుండా డబ్బులు డ్రా చేసి ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ లోకి డబ్బులు మళ్లించాడని చెప్పుకొచ్చాడు.

అతడు ఉదంతం కూలంకషంగా వివరించిన సదరు సీఏ.. ఈజీగా డబ్బులు సంపాదించాలనే భ్రమతో ట్రేడింగ్ ప్రపంచంలో కాలుపెట్టొద్దని హెచ్చరించాడు. అయితే, ఘటనపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బీటెక్ మూడో సంవత్సరంలోనే ఐటీఆర్ ఫైల్ చేయడంపై కొందరు ఆశ్చర్యపోయారు. ట్రేడింగ్‌ను తప్పుపట్టొద్దని మరికొందరు అన్నారు. ఈతరంలో చపలత్వం ఎక్కువగా కనిపిస్తోందని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Read Viral and Telugu News

Updated Date - Jun 25 , 2024 | 08:46 PM