Air India: ఆమ్లెట్‌లో బొద్దింక.. ఎయిర్ ఇండియా ప్రయాణికురాలికి చేదు అనుభవం
ABN , Publish Date - Sep 28 , 2024 | 07:28 PM
ఎయిర్ ఇండియా(Air India) విమాన ప్రయాణికురాలికి చేదు అనుభవం ఎదురైంది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో ఆమెకు ఆమ్లెట్‌లో బొద్దింక కనిపించింది.
ఢిల్లీ: ఎయిర్ ఇండియా(Air India) విమాన ప్రయాణికురాలికి చేదు అనుభవం ఎదురైంది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో ఆమెకు ఆమ్లెట్‌లో బొద్దింక కనిపించింది. ఈ విషయాన్ని బాధితురాలు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. "సెప్టెంబర్ 17, 2024న ఢిల్లీ నుంచి న్యూయార్క్‌కు వెళ్తున్న AI 101 విమానంలో ఆహారాన్ని ఆర్డర్ చేశాను. ఆమ్లెట్‌లో బొద్దింక కనిపించింది. దీంతో సిబ్బందికి ఫిర్యాదు చేశాను" అని బాధితురాలు తెలిపారు. విమానంలో అందించిన ఆహార పదార్థాల వీడియోలు, చిత్రాలను అతను ఎక్స్‌లో షేర్ చేశారు. ఈ పోస్ట్‌ను పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుకు ట్యాగ్ చేశారు.
స్పందించిన ఎయిర్ ఇండియా...
ఆమ్లెట్‌లో బొద్దింక కనిపించిన ఘటనపై ఎయిర్ ఇండియా యాజమాన్యం స్పందించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్ట్ చేసింది. ఆమ్లెట్‌లో బొద్దింక ఘటనపై నెటిజన్లు మండిపడుతున్నారు. విమానాయన సిబ్బంది ఇకనైన తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనను విచారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Hassan Nasrallah: హసన్ నస్రల్లా ఎవరు.. ఇజ్రాయెల్ అంటే భయమెందుకు
Rain Alert: నేడు ఈ ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ
Indian Railways: పండుగల రద్దీ దృష్ట్యా 6 వేల ప్రత్యేక రైళ్లు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here