Share News

Akshaya Tritiya: అక్షయ తృతీయకు బంగారు ఆభరణాలు కొనే ఆలోచనలో ఉన్నారా? ఓసారి ఈ నగల వైపు లుక్కేయండి..!

ABN , Publish Date - May 09 , 2024 | 10:55 AM

అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం మంచిదని నమ్మేవారు ఏడాది మొత్తం డబ్బు పోగేసుకొని మరీ కొంటూంటారు. ఆభరణాలు కూడా ప్రత్యేకంగా, స్టైలిష్ గా కనిపించాలని కోరుకుంటారు కూడా. సెలబ్రిటీలను సైతం కట్టిపడేసే కొన్ని ఆభరణాలు చూస్తే

Akshaya Tritiya: అక్షయ తృతీయకు బంగారు ఆభరణాలు కొనే ఆలోచనలో ఉన్నారా? ఓసారి ఈ నగల వైపు లుక్కేయండి..!

బంగారమంటే భారతీయులకు చాలా ఇష్టం. మరీ ముఖ్యంగా భారతీయ మహిళలు ఒంటి మీద ఎంతో కొంత బంగారం లేకుండా అస్సలు కనిపించరు. మతంతో సంబంధం లేకుండా బంగారం ధరించడం అన్ని చోట్లా కనిపిస్తుంది. అయితే హిందూ సంప్రదాయంలో అక్షయ తృతీయకు, ఆషాఢ మాసంలోనూ బంగారం కొనడం చాలామంచిదని అంటారు. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం మంచిదని నమ్మేవారు ఏడాది మొత్తం డబ్బు పోగేసుకొని మరీ కొంటూంటారు. ఆభరణాలు కూడా ప్రత్యేకంగా, స్టైలిష్ గా కనిపించాలని కోరుకుంటారు కూడా. సెలబ్రిటీలు ఇష్టపడే కొన్ని ఆభరణాలు ఇక్కడున్నాయి. ఓసారి వాటి వైపు లుక్కేయండి..

చోకర్..

ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అవుతున్న ఆభరణాలలో చోకర్ లు ఒకటి. ఇవి మెడకు అతుక్కుని పెద్దగా డాలర్ లాగా ఉంటాయి. వీటిని మెడకు బంధిస్తూ సన్నని చైన్ లేదా బీడ్స్ లేయర్స్ ఉంటాయి. వీటికి మ్యాచింగ్ గా వచ్చే చెవి కమ్మలు మరింత మంచి లుక్ తీసుకునివస్తాయి. ఈ జ్యువెలరీని ఎలాంటి డ్రస్సులలోకి అయినా పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేయవచ్చు.

అక్షయ తృతీయ గురించి ఈ నిజాలు తెలుసా..?

.


పూల ఆభరణాలు..

పూల ఆభరణాలు చూడటానికి చాలామంచి లుక్ ఇస్తాయి. నెమలి, సీతాకోక, మామిడి పిందె వంటి ఆకారాల మధ్యన పువ్వులతో కూడిన డిజెన్లలో ఆభరణాలు బోలెడు లభ్యమవుతున్నాయి. పూల డిజైన్ తో ఉన్న చోకర్, దానికి మ్యాచ్ అయ్యే చెవి కమ్మలు కూడా చాలా అట్రాక్షన్ గా కనిపిస్తాయి. ఈ జ్యువెలరీ చీర లేదా లెహంగా వంటి దుస్తులకు బాగా సెట్ అవుతాయి.

వజ్రాభరణాలు..

వజ్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది అనే కొటెషన్ ప్రజలలోకి ఎంతగా పాతుకుపోయిందంటే వజ్రాభరణాలు ఉండటం అంటే అదొక ప్రెస్టేజ్ అనుకుంటారు. డైమెండ్ ఆభరణాలు ఎల్లప్పుడూ సెట్ గా ధరిస్తే బాగుంటాయి. చెవి కమ్మలు, మెడలో నెక్లెస్ సెట్ చాలా అట్రాక్షన్ గా ఉంటుంది.

వెన్నునొప్పి వేధిస్తోందా? ఈ 6 వ్యాయామాలతో ఇట్టే మాయం..!


జెమ్స్..

బంగారం, డైమెంట్ మాత్రమే కాకుండా నవరత్నాలలో ఉండే వివిధ రకాల రాళ్లు పొదిగిన ఆభరణాలు కూడా చాలా అట్రాక్షన్ గా ఉంటాయి. ఇవి దుస్తుల రంగుకు తగినట్టు చాలా గ్రాండ్ లుక్ ఇస్తాయి

వెన్నునొప్పి వేధిస్తోందా? ఈ 6 వ్యాయామాలతో ఇట్టే మాయం..!

అక్షయ తృతీయ గురించి ఈ నిజాలు తెలుసా..?

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 09 , 2024 | 10:55 AM