Share News

Aluminum Foil: ఆహారం ప్యాక్ చెయ్యడానికి అల్వూమినియం ఫాయిల్ వాడచ్చా? దిమ్మతిరిగిపోయే నిజాలివీ..!

ABN , Publish Date - Jul 26 , 2024 | 01:26 PM

చపాతీ, నూడిల్స్, బిరియానీ, ఫ్రైడ్ రైస్, కర్రీలు.. ఇలా ఏం కొన్నా హోటళ్ళలోనూ, టిఫిన్ సెంటర్లలోనూ అల్యూమినియం ఫాయిల్ లేదా కవర్లలో ప్యాక్ చేసి ఇస్తుంటారు. దీని వల్ల ఆహారం ఎక్కువసేపు వేడిగా ఉంటుంది. వేడిగా ఉన్న ఆహారం మృదువుగా కూడా ఉంటుంది. కానీ..

Aluminum Foil: ఆహారం ప్యాక్ చెయ్యడానికి అల్వూమినియం ఫాయిల్ వాడచ్చా? దిమ్మతిరిగిపోయే నిజాలివీ..!
Aluminum Foil

చపాతీ, నూడిల్స్, బిరియానీ, ఫ్రైడ్ రైస్, కర్రీలు.. ఇలా ఏం కొన్నా హోటళ్ళలోనూ, టిఫిన్ సెంటర్లలోనూ అల్యూమినియం ఫాయిల్ లేదా కవర్లలో ప్యాక్ చేసి ఇస్తుంటారు. దీని వల్ల ఆహారం ఎక్కువసేపు వేడిగా ఉంటుంది. వేడిగా ఉన్న ఆహారం మృదువుగా కూడా ఉంటుంది. ఇది గమనించి చాలామంది మహిళలు పిల్లలకు, మగవారికి లంచ్ ప్యాక్ చేయడం కోసం అల్యూమినియం ఫాయిల్స్ ను ఉపయోగిస్తున్నారు. అయితే ఇది ఆరోగ్యానికి చేసే చేటు అంతా ఇంతా కాదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అల్యూమినియం ఫాయిల్ గురించి బయటపడిన దిమ్మతిరిగిపోయే నిజాలేంటో తెలుసుకుంటే..

Kidney: శరీరంలో ఈ అవయవాలలో వాపు కనిపిస్తే కిడ్నీ సమస్యలున్నట్టే.. వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిందే..!



అల్యూమినియం ప్రభావం..

ఆరోగ్యం మీద అల్యూమినియం చాలా చెడ్డ ప్రభావం చూపిస్తుందని ఎప్పటినుండో చెబుతున్నారు. అల్యూమినియం పాత్రలను ఉపయోగించడం తగ్గించాలని ఇందుకే చెబుతూ వచ్చారు. అయినా ప్రజలలో మార్పు లేదు. ఆహారాన్నిపండిస్తున్న నేల ద్వారా, వంటలు చేయడానికి అల్యూమినియం పాత్రలు వాడటం, ప్యాకింగ్ చేయడానికి అల్యూమినియం ఆధారిత ఉత్పత్తులు వాడటం మొదలైన కారణాల వల్ల శరీరంలోకి అల్యూమినియం పెద్ద మొత్తంలో చేరుతోంది. మానవ మూత్రం, మలంలో వీటి అవశేషాలు బయటకు వెళ్లినప్పటికీ ఇవి శరీరంలోకి ఎక్కువగా వెళితే అది తీవ్రమైన దుష్ర్పభావాలకు దారితీస్తోంది.

Mustard Oil: ఆవాల నూనె ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుందా? మీకు తెలియని నిజాలివీ..!



సమస్యలు..

అల్యూమినియం శరీరంలోకి ఎక్కువగా వెళ్లడం వల్ల గందరగోళం, కండరాల బలహీనత, ఎముకల నొప్పి, మూర్చలు, మాట్లాడటంలో తడబాటు, పిల్లలలో ఎదుగుదల తగ్గడం మొదలైవని ఏర్పడతాయి. ముఖ్యంగా అల్యూమినియం పాత్రలో వండటం కంటే కూడా అల్యూమినియం ఫాయిల్, కవర్లలో ఆహారాన్ని ప్యాక్ చేయడం చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందని పరిశోధకులు అంటున్నారు.

అల్జీమర్స్, పార్కన్సన్స్, మల్టిపుల్ స్ల్కెరోసిస్ వంటి నాడీ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచడంలో అల్యూమినియం కీలకపాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా టమోటా, నిమ్మ వంటి ఆమ్ల గుణం కలిగిన పదార్థాలు అల్యూమినియం పాత్రలలో వేడిచేస్తే ప్రతిచర్య కారణంగా అల్యూమినియం ఎక్కువగా లీక్ అవుతుంది.

Sore Throat: ఈ 2 పదార్థాలు వాడితే చాలు.. వర్షాకాలంలో ఎదురయ్యే గొంతు నొప్పికి చెక్ పెట్టవచ్చు..!



జాగ్రత్తలు..

  • వంటగదిలో అల్యూమినియం పాత్రలు భాగం అయిపోయాయి. వీటిని తొలగించడం అంత సులువుగా సాధ్యమయ్యే పని కాదు. అయితే వీటి వినియోగాన్ని తగ్గించడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.

  • తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆహారాన్ని ఉడికించాలి. ఆహారాన్ని వండటానికి మట్టి, గాజు, సిరామిక్, స్టీల్ పాత్రలలో ఆహారాన్ని వండుకోవాలి.

  • అల్యూమినియం ఫాయిల్ లో ఆహారాన్ని ప్యాక్ చేసినా దాన్ని ఎక్కువసేపు ఉంచకూడదు.

  • ముఖ్యంగా ఆహారాన్ని అల్యూమినియం ఫాయిల్ లో ఉంచి ఓవెన్ లో పెట్టి వేడిచేయడం చాలా డేంజర్.. దీన్ని అస్సలు చేయకూడదు.

ఇవి తింటే చాలు.. వర్షాకాలంలో విటమిన్-డి లోపం మిమ్మల్సి టచ్ చేయదు..!

వైద్యులు చెప్పిన నిజాలు.. ఈ ఆల్కహాల్ రకాలు చాలా హెల్తీ..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 26 , 2024 | 01:26 PM