Share News

Ambanis- Mass Wedding: అంబానీల ఆధ్వర్యంలో సామూహిక వివాహలు.. ఒక్కటైన 50 జంటలు

ABN , Publish Date - Jul 02 , 2024 | 08:20 PM

తమ ఇంట పెళ్లి సందడి మొదలైన నేపథ్యంలో అంబానీ కుటుంబం మరోసారి తమ దాతృత్వాన్ని చాటుకుంది. సామూహిక వివాహ కార్యక్రమం ఏర్పాటు చేసి 50 పేద జంటలను ఒక్కటి చేసింది.

Ambanis- Mass Wedding: అంబానీల ఆధ్వర్యంలో సామూహిక వివాహలు.. ఒక్కటైన 50 జంటలు

ఇంటర్నెట్ డెస్క్: తమ ఇంట పెళ్లి సందడి మొదలైన నేపథ్యంలో అంబానీ కుటుంబం (Ambanis) మరోసారి తమ దాతృత్వాన్ని చాటుకుంది. సామూహిక వివాహ కార్యక్రమం ఏర్పాటు చేసి 50 పేద జంటలను ఒక్కటి చేసింది. థానేలోని రిలయన్స్ కార్పొరేట్ పార్క్‌లో ముఖేశ్, నీతా అంబానీలు పెళ్లిళ్లు జరిపించారు. ముఖేశ్ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ, కోడలు శ్లోకా మెహతా, కుమార్తె ఈశా, అల్లుడు ఆనంద్ కూడా హాజరయ్యారు. వధూవరుల కుటుంబాలకు చెందిన 800 మంది కూడా హాజరయ్యారు. వివాహం అనంతరం అతిథులందరికీ విందు ఏర్పాటు చేశారు. (Ambanis organise mass wedding for 50 couples ahead of Anant-Radhika wedding).

Nita Ambani Viral Video: చాట్ తింటూ కాశీలో సందడి చేసిన నీతా అంబానీ.. ఆకస్మిక పరిణామంతో స్థానికులు షాక్

ఈ సందర్భంగా అంబానీలు నూతన వధూవరులకు పెద్ద ఎత్తున కానుకలు అందించారు. బంగారు మంగళసూత్రం, వివాహ ఉంగరాలు, ముక్కుపుడక, వెండి మెట్టెలు, పట్టీలు ఇచ్చారు. పెళ్లి కుమార్తెకు స్త్రీధనం కింద రూ.1.01 చెక్కును అందజేశారు. కొత్త దంపతుల సంసారం సజావుగా సాగేందుకు ఏడాదికి సరిపడా పచారీ సామాను, గ్యాస్ స్టవ్, మిక్సీ, ఫ్యాన్, పరుపులు, దిండ్లు, గిన్నెలు అందజేశారు. అతిథులందరికీ విందుభోజనం కూడా ఏర్పాటు చేశారు. నూతన దంపతులను ముఖేశ్, నీతా అంబానీ ఆశీర్వదించారు.


మానవ సేవే మాధవ సేవ అని విశ్వసించే అంబానీ కుటుంబానికి తమ ఇంట ప్రతి శుభకార్యాన్ని సమాజ సేవతో ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అంబానీలు సామూహిక వివాహాలను నిర్వహించారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరిపిస్తామని కూడా అంబానీ కుటుంబం పేర్కొంది. ఇక అనంత్, రాధికా అంబానీల వివాహం జులై 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న విషయం తెలిసిందే.

Read Latest News and National News

Updated Date - Jul 02 , 2024 | 08:29 PM