Share News

Viral Video: వామ్మో.. మిరపకాయలను ఎలా నమిలేస్తున్నాడో చూడండి.. దెబ్బకు గిన్నీస్ రికార్డు వచ్చేసింది!

ABN , Publish Date - Jan 07 , 2024 | 03:34 PM

మిరపకాయలు అనేవి మన ఆహారంలో అత్యంత ముఖ్యమైనవి. ప్రతి ఇంటి వంటింట్లోనూ మిరపకాయలు ఉంటాయి. వివిధ రకాల వంటకాలకు రుచిని అందించడానికి వీటిని ఉపయోగిస్తుంటాం. అయితే మిరపకాయలను నేరుగా తినడం మాత్రం చాలా కష్టం.

Viral Video: వామ్మో.. మిరపకాయలను ఎలా నమిలేస్తున్నాడో చూడండి.. దెబ్బకు గిన్నీస్ రికార్డు వచ్చేసింది!

మిరపకాయలు (Chillies) అనేవి మన ఆహారంలో అత్యంత ముఖ్యమైనవి. ప్రతి ఇంటి వంటింట్లోనూ మిరపకాయలు ఉంటాయి. వివిధ రకాల వంటకాలకు రుచిని అందించడానికి వీటిని ఉపయోగిస్తుంటాం. అయితే మిరపకాయలను నేరుగా తినడం మాత్రం చాలా కష్టం. అదీ అతి కారంగా ఉండే భుట్ జోలోకియా మిరపకాయలను (Bhut Jolokia Chillies) తినడం అంటే మాటలతో పని కాదు.

అమెరికాకు చెందిన గ్రెగ్ ఫోస్టర్ (Greg Foster) అనే వ్యక్తి 10 భుట్ జోలోకియా మిరపకాయలను కేవలం 30.01 సెకెండ్ల వ్యవధిలో తినేసి ప్రపంచ రికార్డు సాధించాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (Guinness World Records) సంస్థ తమ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో రికార్డ్ బ్రేకింగ్ మూమెంట్‌ను షేర్ చేసింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో గ్రెగ్ ప్లేట్‌లో ఉన్న మిరపకాయలను ఒకదాని తర్వాత మరొకటి అత్యంత వేగంగా తినేశాడు. భూట్ జోలోకియా అనేది ప్రపంచంలోనే అత్యంత కారం, ఘాటుగా ఉండే మిరపకాయలు. అలాంటి 10 ఘాటు మిరపకాయలను గ్రెగ్ కేవలం 30.01 సెకెండ్లలో తినేశాడు.

గ్రెగ్ ఫోస్టర్ ఇలా మిరపకాయలను తిని ప్రపంచ రికార్డు సాధించడం ఇదే మొదటిసారి కాదు. 2021లో మూడు కరోలినా రీపర్ మిరపకాయలను గ్రెగ్ 8.72 సెకెండ్లలో తినేసి రికార్డు సృష్టించాడు. అంతకు ముందు కూడా గ్రెగ్ ఇలాంటి పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

Updated Date - Jan 07 , 2024 | 03:34 PM