Share News

Nareshi Meena: కేబీసీలో రూ. 50 లక్షలు గెల్చుకున్న నరేశి మీనా.. సాయం చేస్తానన్న అమితాబ్

ABN , Publish Date - Aug 25 , 2024 | 01:10 PM

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న 27 ఏళ్ల యువతి నరేశి మీనా(Nareshi Meena) కేబీసీలో రూ. 50 లక్షలు గెలుచుకున్నారు. అయితే ఈ బహుమతితో పాటు అమితాబ్ బచ్చన్ స్వయంగా ఆమె గురించి ఎమోషనల్ అవుతు ప్రత్యేక బహుమతిని ప్రకటించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Nareshi Meena: కేబీసీలో రూ. 50 లక్షలు గెల్చుకున్న నరేశి మీనా.. సాయం చేస్తానన్న అమితాబ్
Amitabh bachchan help to Nareshi Meena

బిగ్ బి అమితాబ్ బచ్చన్(amitabh bachchan) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'కౌన్ బనేగా కరోడ్ పతి 16' ఇటివల ప్రారంభమైంది. ఈ 16వ సీజన్‌లో నరేశి మీనా అనే 27 ఏళ్ల యువతి ఇటివల కోటి రూపాయల ప్రశ్న వరకు చేరుకున్నారు. ఆ సమయంలో ఆమె కథ విన్న తర్వాత అమితాబ్ బచ్చన్‌తో సహా స్టూడియోలో ఉన్న అనేక మంది కన్నీరు పెట్టుకున్నారు. కానీ మీనా మాత్రం కోటి గెల్చుకోలేకపోయింది. కోటి రూపాయల ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పలేక 50 లక్షల రూపాయలతో షో నుంచి బయటకు వచ్చేసింది. అయితే ఆమె గురించి తెలిసిన అనేక మంది ఎందుకు ఎమోషనల్ అయ్యారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


వైద్య పరీక్షల్లో

2018లో సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) పరీక్షలో ఉత్తీర్ణత సాధించి వైద్య పరీక్షల కోసం వెళ్లినప్పుడు నరేశి మీనాకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ వార్త ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ క్రమంలో ఆమె చాలా కాలం పాటు డిప్రెషన్‌లో ఉండిపోయింది. అయినప్పటికీ కుటుంబంలోని తల్లి ఛోటీ దేవి, తండ్రి రాజ్మల్, అన్నయ్యలు శివరామ్, లక్ష్మీకాంత్ ఆమెకు అండగా నిలిచారు. ఆమెకు చికిత్స చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారు. ఆ క్రమంలో వారి ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉన్నప్పటికీ తల్లి నగలు అమ్మి నరేశి చికిత్సకు ఆర్థికసాయం చేసింది.


టీవీ లేకపోవడంతో

నరేశి మీనా రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లా ఎండా నివాసి. 27 ఏళ్ల నరేష్ మీనాకు 2018లో బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. 2019లో ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ జరిగింది. కానీ ఆ తర్వాత బ్రెయిన్ ట్యూమర్ ఆమెకు పూర్తిగా నయం కాలేదు. తన కోచింగ్ టీచర్ ప్రేరణతో నరేశి "కౌన్ బనేగా కరోడ్ పతి"లో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో టీవీ లేకపోవడంతో మేనమామ ఇంటికి వెళ్లి షోలు చూసేది. నరేషి ఈ ప్రేరణ క్రమంగా KBC హాట్ సీట్‌కి వెళ్లేలా చేసింది. ఆ క్రమంలోనే ఆమె గేమ్ షోలో రూ. 50 లక్షలు గెలుచుకున్నారు.


కోటి రూపాయల ప్రశ్న

ఆ క్రమంలోనే అమితాబ్ బచ్చన్ నరేశిని కోటి రూపాయల ప్రశ్న అడిగారు. వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్స్‌లో లీలారావు దయాల్ ఎవరిని ఓడించి సింగిల్స్ మ్యాచ్ గెలిచిన మొదటి భారతీయ మహిళగా అవతరించారని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు నరేష్ మీనా కంగారు పడింది. దీంతో షో నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. మీరు దీనికి ఎలా సమాధానమిస్తారని అడిగినప్పుడు తప్పు సమాధానం చెప్పింది. దీంతో నరేష్ 50 లక్షలతో షో నుంచి వాకౌట్ అయ్యారు.


అమితాబ్ ఉద్వేగం

అయితే KBCలో నరేష్ ప్రధాన లక్ష్యం ఆమె డబ్బు గెలవడమే కాదు. తన బ్రెయిన్ ట్యూమర్‌ను వైద్యులు పూర్తిగా తొలగించలేకపోయిన తీవ్ర పరిస్థితి గురించి షోలో వివరించారు. కణితి భాగం ఇప్పటికీ ఆమె మెదడులో ఉంది. దాని అధునాతన ప్రోటాన్ చికిత్స చాలా ఖరీదైనది. ఆమె కథ విన్న అమితాబ్ బచ్చన్ ఎంత ఉద్వేగానికి లోనయ్యారు. ఆమె చికిత్స ఖర్చులను తానే భరిస్తానని నరేశికి హామీ ఇచ్చారు. దీంతో వచ్చిన డబ్బుతో నరేశి తన కుటుంబం కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆమె తన తల్లి నగలను తిరిగి పొందాలని కోరుకుంటుంది. తన తండ్రికి మంచి బహుమతిని కూడా ఇవ్వాలనుకుంటోంది. వారు ప్రస్తుతం అద్దెకు ఉంటున్న సవాయ్ మాధోపూర్‌లో ఇల్లు కొనాలని యోచిస్తున్నట్లు సమాచారం.


చదువు

నరేశి తన గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి వరకు చదివారు. ఆ తర్వాత సవాయ్ మాధోపూర్‌లోని సుర్భి పబ్లిక్ స్కూల్ నుంచి 12వ తరగతి, దీని తరువాత 2017 బీఏలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత పొలిటికల్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ప్రస్తుతం నరేషి మీనా రాజస్థాన్‌లోని మహిళా సాధికారత విభాగంలో సూపర్‌వైజర్‌గా నియమితులయ్యారు. ఏది ఏమైనా ఆమె వ్యాధి వచ్చినా కూడా నిరంతరం నేర్చుకుంటూ చేసిన ప్రయాణం అనేక మందికి స్ఫూర్తినిస్తుంది.


ఇవి కూడా చదవండి..

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. నది ఒడ్డున నడుస్తున్న కుక్క.. హఠాత్తుగా నీళ్లలోంచి వచ్చిన మొసలి ఏం చేసిందంటే..


Viral Video: వామ్మో.. ధైర్యవంతులైతేనే ఈ వీడియో చూడండి.. కింగ్ కోబ్రా భయంకర రూపం చూస్తే నివ్వెరపోవాల్సిందే..!


Viral: ఛీ..ఛీ.. మార్చురీలో ఇదేం పని.. 75 శవాల మధ్య అసభ్యకర స్థితిలో కెమెరాకు చిక్కిన జంట.. వీడియో తీస్తున్నా..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 25 , 2024 | 01:11 PM